»   » ధనుష్ నాకు అబద్దాలు చెప్పాడు, ఆపేపర్లు చూసి భయపడ్డాను: కాజోల్

ధనుష్ నాకు అబద్దాలు చెప్పాడు, ఆపేపర్లు చూసి భయపడ్డాను: కాజోల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ధనుష్, అమలాపాల్ హీరోహీరోయిన్లుగా, నిన్నటితరం బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ప్రతినాయికగా నటిస్తున్న చిత్రం 'వీఐపీ-2'. తమిళంలో 'వేలాయిల్లా పట్టాదారి-2'గా తెరకెక్కిన ఈ చిత్రం.. హిందీలో 'లాల్కర్'గా డబ్ అవుతోంది. ముంబైలో ఈ సినిమా ఆడియోను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కాజోల్ హాజరయ్యారు. ధనుష్, సౌందర్యలపై కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. ధనుష్, సౌందర్యలు తనకు ఓ అబద్ధం చెప్పి మోసం చేశారని అన్నారు కాజోల్.

అబద్ధం చెప్పారు

అబద్ధం చెప్పారు

తనకు హిందీ తప్ప వేరే భాష ఏమీ మాట్లాడటం రాదని.. ఐతే ధనుష్.. సౌందర్య తనకు ‘వీఐపీ-2' గురించి చెప్పినపుడు అబద్ధం చెప్పారని కాజోల్ చెప్పింది. ఈ సినిమాలో తాను తమిళంలో మాట్లాడాల్సిన అవసరం లేదని.. తమిళ డైలాగులు చెప్పాల్సిన పనిలేదని అన్నారని.. అదంతా ఒట్టి మాటేనని తొలి రోజు షూటింగ్ లోనే తెలిసిపోయిందని చెప్పింది.

తనకు భయమేసిందట

తనకు భయమేసిందట

రెండు సీన్లకు సంబంధించి తనకు స్క్రిప్టు పేపర్ ఇచ్చారని.. అందులో పెద్ద పెద్ద తమిళ డైలాగులుండటం చూసి కంగు తినడం తన వంతైందని కాజల్ తెలిపింది. ఆ డైలాగ్స్ చూడగానే తనకు భయమేసిందని.. ఐతే ఆ డైలాగుల్ని ఎలాగోలా చెప్పే ప్రయత్నం చేయండంటూ సింపుల్ గా చెప్పేశారని కాజోల్ వివరించింది.

రెండు దశాబ్దాల తర్వాత

రెండు దశాబ్దాల తర్వాత

ఇది మోసం అని.. ఐతే ఎలాగోలా తనతో తమిళ డైలాగులు చెప్పించిన ఘనత మాత్రం ధనుష్.. సౌందర్యలదే అని కాజోల్ చెప్పింది. 90ల చివర్లో తమిళంలో ‘మిన్సార కనవు' (మెరుపు కలలు) సినిమా చేసిన కాజోల్.. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఆ భాషలో ‘వీఐపీ-2' చేసింది. ఈ చిత్రం అదే పేరుతో తెలుగులో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

నెగిటివ్ రోల్ లో

నెగిటివ్ రోల్ లో

ఇటీవలే రజని చేతుల మీదుగా మూవీ లాంచ్ జరిగింది. సౌందర్య రజినీకాంత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కాజోల్ పాత్ర గురించి వార్తలు బయటకు వచ్చాయి. వీఐపీ 2లో కాజోల్ మహిళా వ్యాపారవేత్తగా , నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వీఐపీ 2

వీఐపీ 2

మరోవైపు కాజోల్ డిఫరెంట్ షేడ్స్‌లో ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ..రఘువరన్ బి టిక్ పేరుతో తెలుగు లో రిలీజ్ అయి , సూపర్ సక్సెస్ అవడమే కాదు ధనుష్ కు తెలుగు లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో వీఐపీ 2 ఫై తెలుగు ఆడియన్స్ సైతం ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

English summary
Bollywood actor Kajol is making a comeback to Tamil films with Dhanush starrer aka VIP 2. It is a sequel to the 2014 hit Tamil movie, VIP and has been dubbed in Telugu and Hindi too.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu