For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమంత,ఎమీ జాక్సన్ హీరోయిన్స్ గా...

  By Srikanya
  |

  చెన్నై : సమంత,ఎమి జాక్సన్ ఇద్దరూ టాప్ హీరోయిన్స్. వీరిద్దరూ ఒకే సినిమాల్లో ఉంటే ఇంక చెప్పేదేముంది..ప్రేక్షకులకు పండుగే. అలాంటిదే ఇప్పుడు జరగబోతోంది. అదీ ఆశామాషీ కాంబినేషన్ లో కాదు. పూర్తి వివరాల్లోకి వెళితే...

  'షమితాబ్‌', 'అనేగన్‌' (అనేకుడు)చిత్రాలతో భారత సినీ జనాలను ఆకట్టుకుంటున్న నటుడు ధనుష్‌. అంతకుముందు వేల్‌రాజ్‌ దర్శకత్వంలో విడుదలైన 'వేలై ఇల్లా పట్టదారి' (తెలుగులో రఘువరన్ ఎంటెక్) వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందించారు. ఇప్పుడు మళ్లీ ఇదే జట్టు మరో చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. ఇందులో ఎమీజాక్సన్‌, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  'వీఐపీ' చిత్ర యూనిట్‌తో తెరకెక్కుతుండటంతో ఇది 'వీఐపీ- 2' అని కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. 'మారి' చిత్రం కోసం గడ్డం పెంచుకుని కనిపించిన ధనుష్‌.. ఈ సినిమా కోసం పదహారేళ్ల యువకుడిగా మారిపోయారు. 'తుల్లువదో ఇలమై' ధనుష్‌లా కనిపిస్తున్నారు. తన వండర్‌బార్‌ సంస్థ బ్యానరులో ధనుష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  Dhanush starts shooting for his next flick with Samantha and Amy Jackson!

  ఇక ధనుష్ తాజా చిత్రం మారి విషయానికి వస్తే...

  బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో 'మారి'లో ధనుష్‌ నటిస్తున్నారు. ఆయనకు జంటగా కాజల్‌ అగర్వాల్‌ ఆడిపాడుతోంది. శరవేగంగా జరిగిన చిత్రీకరణ శరవేగంగా జరిగి ఇటీవలే ముగిసింది. బృందానికి ధనుష్‌ బిర్యానీ విందు ఏర్పాటు చేయడంతోపాటు స్వయంగా వడ్డించారు.

  మారి ఓ తమిళ కామెడీ చిత్రం. ఇందులో ధనుష్ సరసన కాజల్ అగర్వాల్ చేస్తోంది. విజయ్ యేసుదాస్, రోబో శంకర్, కాళి వెంకట్ ఈ చిత్రంలో మిగతా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంకోసం చెన్నై పరిసరప్రాంతాల్లో స్లమ్ లో ఉండే హౌస్ సెట్ వేసారు. అక్కడే షూటింగ్ ఎక్కువ భాగం చేసారు. నార్త్ మద్రాస్ లో ఉంటే టైలర్ పాత్రలో ధనుష్ కనిపించనున్నారు. లోకల్ స్లమ్ లో ఓ లీడర్ గా ఉంటూంటాడు. అందుకే ప్రత్యేకంగా మద్రాస్ బాషను మాట్లాడుతాడు

  అలాగే ఈ చిత్రంలో ధనుష్...కోర మీసాలు, పిల్లి గడ్డం పెంచి కొత్తగా కనిపించనున్నారు. వేల్లై ఇలా పట్టదారి చిత్రం తర్వాత ధనుష్ తన హుండర్ బార్ ఫిల్మ్స్ ప్రెవేట్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం ఇది.

  తెలుగులోనూ..

  తమిళ హీరో ధనుష్ తన డబ్బింగ్ చిత్రాలతో తెలుగులో చాలా కాలం నుంచి దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఆపు, అంతులేకుండా సాగుతున్న ఈ పోరాటం అతనికి ప్రతీ సారి అతనికి పరాజయాన్నే మిగిలిస్తోంది. అయితే తాజాగా తెలుగులో ఆయన ఫేట్ మారింది. ఆయన చిత్రం తొలి సారి 50 రోజులు పడింది. వైజాగ్ లో ఆయన తాజా చిత్రం రఘువరన్ బిటెక్ 50 రోజులు ఓ థియోటర్ లో ఆడి రికార్డు క్రియేట్ చేసింది. ఈ మారి చిత్రం సైతం ఇక్కడ డబ్బింగ్ అయ్యి విడుదల కానుంది.

  హిట్టైన తమిళ సినిమాలు తెలుగులో రీమేక్ లేదా డబ్బింగ్ గా రావటం కొత్తేమీ కాదు. తాజాగా మరో చిత్రం అలా డబ్బింగ్ అయ్యి తెలుగులోకి వచ్చింది. అయితే ఎవరో ఊరూ పేరు లేని బ్యానర్ కాకుండా...తెలుగులో పెద్ద పేరున్న,సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన స్రవంతి మూవీస్ పతాకంపై ఈ చిత్రం విడుదల అవుతూండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడి ఓపినింగ్స్ వచ్చాయి. దానికి తోడు తమిళంలోనూ ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది. ధనుష్‌ హీరోగా నటించిన తమిళ సినిమా ‘వీఐపీ' తెలుగులో ‘రఘువరన్‌ బీటెక్‌'గా విడుదల అయ్యి విజయం సాధించింది.

  English summary
  Dhanush has started shooting for VIP director Velraj’s next along with Samantha and Amy Jackson.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X