»   » ఇంకో హిందీ సినిమా ఓకే చేసేసాడు

ఇంకో హిందీ సినిమా ఓకే చేసేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Dhanush
చెన్నై : సౌత్ హీరోలు బాలీవుడ్ లో మార్కెట్ పెంచుకుంటూ దూసుకు పోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో ధనుష్ చేరారు. ఇప్పటికే 'రాంజానా' తో బాలీవుడ్ అడుగుపెట్టిన ధనుష్ ఆ చిత్రం ఫినిష్ చేసిన మరో చిత్రం కమిటయ్యి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆయన చేసిన 'రాంజానా' ట్రైలర్స్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాయి.

ఇక నుంచీ హిందీలో ఒకటి, తమిళంలో ఒకటి చిత్రం చొప్పున కెరీర్‌ను కొనసాగిస్తానని ప్రకటించిన ధనుష్‌ ఆ మాట నిలబెట్టుకున్నాడు. ధనుష్‌ తొలిసారిగా నటిస్తున్న హిందీ సినిమా 'రాంజానా'. క్రిష్కలుల్లా నిర్మిస్తున్నాడు. ఆనంద్‌ ఎల్‌రాయ్‌ (తను వెడ్స్ మను దర్సకుడు) తెరకెక్కిస్తున్నాడు. సోనమ్‌ కపూర్‌ హీరోయిన్. షూటింగ్‌ పూర్తయింది. ఈ నేపధ్యంలో ఆయన మరో బాలీవుడ్ చిత్రం కమిటయ్యాడు.


ధనుష్‌ మాట్లాడుతూ.. తనకు భాష ముఖ్యం కాదని, కథ నచ్చితే చాలని తెలిపాడు. బాలీవుడ్‌లో క్రమం తప్పక నటిస్తానని అక్కడొకటి, ఇక్కడొకటి చొప్పున కెరీర్‌ కొనసాగుతుందని స్పష్టం చేశాడు. ఆ మేరకు ప్రస్తుతం మరో హిందీ కథకు పచ్చజెండా ఊపాడు.

ఈ కొత్త చిత్రం కూడా 'రాంజానా' దర్శకుడు ఆనంద్‌ ఎల్‌రాయ్‌ నిర్దేశకత్వంలోనే రూపొందనుండటం విశేషం. కథ నచ్చటంతోనే మళ్లీ ఆయన చిత్రంలో నటించేందుకు అంగీకరించాడని, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని ధనుష్‌ సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి.

'రాంజానా' చిత్రం 21న హిందీలో, అదే రోజు 'అంబికాపతి' పేరిట తమిళంలోనూ తెరపైకి రానుంది. దీంతో పాటు భరత్‌బాలా దర్శకత్వంలో నటించిన నేరు తమిళచిత్రం 'మరియన్‌' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

English summary
Dhanush's upcoming Bollywood debut flick, "Raanjhanaa" is not yet hit the theatres but he has landed an opportunity to star in another Hindi film directed by Anand L Rai. The actor is all set to start his new film, a Tamil-Hindi bilingual, with Anand in 2014. The untitled project will be jointly produced by Dhanush under his Wunderbar Films and Anand. Confirming the news, Dhanush tweeted on his microblogging site saying, "It's final.glad 2 announce dat I'm doin a film wid Anand l rai in 2014 which wil b a bilingual n will b produced by wunderbar films n Anand."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu