»   » ఇప్పుడు శత్రువులే... కానీ ఒకప్పుడు..!? కరుణా నిధి జయలలిత (ఈ ఫొటేలే సాక్ష్యం)

ఇప్పుడు శత్రువులే... కానీ ఒకప్పుడు..!? కరుణా నిధి జయలలిత (ఈ ఫొటేలే సాక్ష్యం)

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళనాడు రాజకీయాల్లో జయలలిత, కరుణానిధి గట్టి ప్రత్యర్థులు. ఒకరంటే ఒకరికి ఏ క్షణంలోనూ పడేది కాదు. అలాంటిది ఇద్దరూ కలిసి పనిచేసే అవకాశం అసలు ఎప్పుడైనా.. ఎక్కడైనా ఉంటుందా? జయలలిత దాదాపు 140కి పైగా సినిమాల్లో నటించారు. 1960ల నుంచి 1980ల వరకు ఆమె తమిళ తెరను తిరుగులేకుండా ఏలిన రారాణి. ఆ తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు.

ఆమే కాకుండా.. తమిళ రాజకీయాల్లో ఉన్న మరికొందరు ప్రముఖ నాయకులకు కూడా సినీ పరిశ్రమతో సంబంధం, అనుబంధం ఉన్నాయి. డీఎంకే అధినేత ఎం. కరుణానిధి.. అన్నాడీఎంకే అధినేత్రికి గట్టి ప్రత్యర్థి. కానీ ఆయన కూడా రాజకీయాల్లోకి రాకముందు పేరుమోసిన సినిమా రచయిత. అందుకే వీళ్లిద్దరూ కలిసి ఏమైనా సినిమాలో పనిచేశారా అన్న విషయం ఆసక్తికరంగానే ఉంటుంది. అవును.. ఒకే ఒక్క మాత్రం సినిమాకు ఇద్దరూ పనిచేశారు. ఆ వివరాలు..

 కరుణానిధి:

కరుణానిధి:

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధిల మధ్య ఉన్నంత రాజకీయ వైరం మన దేశంలో మరే ఇద్దరు నేతల మధ్య ఉండకపోవచ్చు. వారిద్దరి నేపథ్యం కూడా ఒకటే. ఇద్దరూ కూడా సినీరంగం నుంచే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. 140కి పైగా సినిమాల్లో నటించిన ఘనత పురచ్చితలైవిది కాగా... తమిళ సినీరంగంలో పేరు మోసిన స్క్రిప్ట్ రైటర్ కరుణానిధి. ఆయనతో తమ సినిమాలకు స్క్రిప్ట్ రాయించుకోవడానికి దర్శకులు, నిర్మాతలు పోటీ పడేవారు.

స్క్రిప్టు రచయిత. :

స్క్రిప్టు రచయిత. :

జయలలిత తమిళంలో చేసిన తొలి సినిమా వెన్నిరాడై (1965). అప్పటికి తమిళ సినీ పరిశ్రమలో కరుణానిధి చాలా విజయవంతమైన స్క్రిప్టు రచయిత. ఆయనతో రాయించుకోవాలని దర్శకులు, నిర్మాతలు వెంటపడుతుండేవారు. కానీ, జయలలిత నటిగా ఎదిగే సమయానికి ఆయన సినిమాలకు రాయడం దాదాపు మానేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేశారు.

మణి మకుటం సినిమా:

మణి మకుటం సినిమా:

కానీ, 1966 సంవత్సరంలో ఎస్.రాజేంద్రన్ దర్శకత్వంలో వచ్చిన మణి మకుటం సినిమా మాత్రం వీళ్లిద్దరినీ కలిపింది. ఆ సినిమాలో జయలలిత సెకండ్ హీరోయిన్‌గా చేశారు. ఆ సినిమాకు కరుణానిధి స్క్రిప్టు అందించారు. రాజకీయాల్లో ఇద్దరూ భీకరంగా తలపడినా, సినిమా రంగంలో మాత్రం ఒక్కసారి ఇద్దరూ కలిసి పనిచేసే అవకాశం లభించింది. కరుణానిధి సృష్టించిన పాత్రను జయలలిత పోషించారు.

సెకండ్ హీరోయిన్ పాత్ర :

సెకండ్ హీరోయిన్ పాత్ర :

ఈ సినిమాలో జయ సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించింది. ఈ చిత్రానికి కరుణానిధి స్క్రిప్ట్ అందించారు. కానీ ఆ సమయంలో ఎవరి ఊహకు కూడా అందలేదు... వీరిద్దరూ భవిష్యత్తులో బద్ధశత్రువులుగా మారుతారని. అయితే ఎన్ని గొడవలున్నా కరుణ మాత్రం జయలలిత అనారోగ్యం పాలయ్యారు అనగానే... ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

English summary
in 1966, Tamil actor S.Rajendran, directed a film named Mani Makudam where Jayalalithaa played the second female lead. M.Karunanidhi happened to be the writer of the film as stated in the official IMDb page of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu