For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నటీనటుల సంఘం ....60 లక్షలు నొక్కేసారు ...విచారణ

By Srikanya
|

చెన్నై: 2004లో తమిళనాడు కుంభకోణం స్కూల్ ఫైర్ ఏక్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ ప్రమాదంలో 94 మంది మరణించారు. అప్పుడు వారిని ఆదుకోవటానికి తమిళనాట ఉన్న నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) వారు...అరవై లక్షలు పోగు చేసారు. కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్,సూర్య, వివేక్ వంటివారు భారిగా విరాళాలు ఇచ్చారు. అయితే ఎవరికీ ఈ డబ్బుని ఇవ్వలేదు. వాటిని తినేసారని అభియోగాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈ విషయమై విచారణ జరుగుతోంది.

నడిగర్‌ సంఘంగా పిలిచే దక్షిణ భారత చలనచిత్ర నటీనటుల సంఘం ట్రస్టీగా ప్రముఖ నటుడు కమలహాసన్‌ను గౌరవ పదవిలో నియమిస్తూ ఆ సంఘ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికల తరహాలో నడిగర్‌ సంఘం ఎన్నికలు ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఇటీవల జరిగిన విషయం తెలిసిందే.

 Did 'Nadigar Sangam' Misuse 60 Lakhs Meant For The Affected Kins Of The 2004 Kumbakonam Tragedy?

29 పదవులకు జరిగిన ఈ ఎన్నికల్లో నాలుగు కార్యవర్గ సభ్యుల పదవులు మినహా మిగిలిన అన్నింటినీ విశాల్‌ నేతృత్వంలోని 'పాండవర్‌' జట్టు కైవసం చేసుకుంది. నూతన కార్యవర్గ సమావేశం ఉదయం చెన్నైలోని స్టార్ హోటల్‌లో జరిగింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సమావేశం అనంతరం అధ్యక్షుడు నాజర్‌, ప్రధాన కార్యదర్శి విశాల్‌, ఉపాధ్యక్షులు పొన్‌వణ్ణన్‌, కార్తి తదితరులు విలేర్లతో మాట్లాడుతూ... పాండవర్‌ జట్టు అనే మాట ఎన్నికలతో ముగిసిపోయిందన్నారు. ఇకపై నడిగర్‌ సంఘం ఒకే జట్టుగా కొనసాగనుందని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన ముఖ్యమంత్రి జయలలిత, నగర పోలీసుశాఖ, పాఠశాల యంత్రాంగం, ఎన్నికల అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

తమకు మార్గదర్శకంగా ఉండాలని నడిగర్‌ సంఘం సీనియర్లను కోరామని చెప్పారు. అందుకు రజనీకాంత్‌, కమలహాసన్‌తో చర్చించామని తెలిపారు. ఇందులో నడిగర్‌ సంఘం ట్రస్టీగా ఉండేందుకు కమలహాసన్‌ అంగీకరించారని, రజనీకాంత్‌ ఇంకా తమ అభిప్రాయాన్ని వెల్లడించలేదని పేర్కొన్నారు. ముందుగా జరిగిన కార్యక్రమంలో ఐసరి గణేష్‌ మాట్లాడుతూ... తన తండ్రి పేరిట ఉన్న ట్రస్టు ద్వారా ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న కళాకారులకు అందిస్తున్న నిధిని రూ.వెయ్యికి పెంచినట్లు తెలిపారు.

English summary
The Kumbakonam school fire accident that took place in 2004 is one of the biggest disasters in the history of Tamil Nadu which snuffed out the lives of 94 innocent kids. Back then, 60 Lakh rupees was reportedly generated by the 'Nadigar Sangam' (Actors' Association) in order to help the grieving parents of the victims. Shockingly, after 11 years since the tragedy happened, no one knows what happened to the generous contribution of the 'Nadigar Sangam' .
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more