»   » మరీ ఇంతదారుణమా? హీరోయిన్‌కు హీరోయినే శత్రువా?

మరీ ఇంతదారుణమా? హీరోయిన్‌కు హీరోయినే శత్రువా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మలయాళ నటి భావనపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడుగా ఉన్న పల్సర్ సునీ విచారణలో సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. భావనను లైంగికంగా వేధించి, బ్లాక్ మెయిల్ చేయాలని తనను ఉసిగొల్పింది సినీ పరిశ్రమకు చెందిన మేడమ్ అని, ఆ మేడం' ఆదేశాల మేరకే భావనను కారులో లైంగికంగా వేధించి, బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకు ఫొటోలు, వీడియోలు తీశానని తెలిపాడు.

  భావన మీద పగతోనే మళయాల హీరో దిలీప్ ఇదంతా చేయించాడని పోలీసులు అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అతడిని అరెస్టు చేసి బెయిల్ రాకుండా చేశారు. ఈ పాపంలో అతడి భార్య కావ్యామాధవన్ హస్తం కూడా ఉందని అనుమానిస్తున్నారు. పల్సర్ సుని చెప్పిన ఆ మేడం, కావ్యమాధవన్ ఒకటే అని పోలీసులు అనుమానిస్తున్నారు.

  ఆడదానికి ఆడదే శత్రువు

  ఆడదానికి ఆడదే శత్రువు

  పల్సర్ సుని చెప్పిన విషయం బయటకు రాగానే.... కేరళ ప్రజల ఆశ్చర్యపోతున్నారు. ఆడదానికి ఆడదే శత్రువు అనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదని చర్చించుకుంటున్నారు.

  Dileep Arrested In Actress Abduction Case | Filmibeat Telugu
  మరీ ఇంత దారుణమా?

  మరీ ఇంత దారుణమా?

  మాన, ప్రాణాల విలువ ఏమిటో ఆడవారికే తెలుసు.... అలాంటిది ఒక మహిళ మరో మహిళ మాన ప్రాణాలతో చెలగాటం ఆడిందనే విషయం ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఇంతకంటే దారుణం ఏమీ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  నరకం అనుభవించిన భావన

  నరకం అనుభవించిన భావన

  ఆ రోజు భావనను ఆమె కారులోనే కిడ్నాప్ చేసి పల్సర్ సుని అండ్ గ్యాంగ్ నరకం చూపించారు. కొచ్చి నగరంలో రాత్రి పూట కారులో తిప్పుతూ లైంగిక వేధింపులకు గురిచేసి తీవ్రంగా హింసించిన సంగతి తెలిసిందే.

  డబ్బుకోసం అనుకున్నారు, కానీ పగ

  డబ్బుకోసం అనుకున్నారు, కానీ పగ

  భావనపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనలో మొత్తం ఏడుగరి ప్రమేయం ఉంది. షూటింగ్ నుండి తిరిగి వస్తున్న ఆమెను కారులో బంధీగా చేసి దాదాపు 45 నిమిషాలపాటు కొచ్చి నగరంలో తిప్పుతూ నరకం చూపారు. అశ్లీలంగా మార్చి ఫొటోలు తీశారు. ఇవి బయటకు రాకూడదంటే 30 లక్షల రూపాయలివ్వాలని... లేకుంటే వాటిని ఇంటర్నెట్లో లీక్ చేస్తామని బెదిరించి ఆమెను వదిలేశారు. తొలుత ఈ సంఘటన డబ్బు కోసం చేశారని అనుకున్నారు. కానీ హీరో దిలీప్ పగతో చేశారనే ఆరోపణలు రావడంతో సౌత్ సినీ ఇండస్ట్రీ షాకైంది.

  భావన మీద ఆమెకు ఎందుకు కోపం

  భావన మీద ఆమెకు ఎందుకు కోపం

  దిలీప్‌, కావ్య మాధవన్ వివాహం సమయంలో భావన ఇబ్బంది పెట్టిందట. దిలీప్ మాజీ భార్య మంజు వారియర్‌కు మద్దతుగా భావన నిలిచింది. అందుకే మంజువారియర్‌కు భావన అంటే కోపం అనే ప్రచారం జరుగుతోంది.

  English summary
  Malayalam superstar Kavya Madhavan was questioned along with her mother as a part of the ongoing investigation into the sensational case last month. Main accused Pulsar Suni had alleged that Kavya knows him very well. Dileep's bail plea hearing will resume on Wednesday at the Kerala High Court.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more