Just In
Don't Miss!
- News
Red Fort ముట్టడి: ఎర్రకోటపై ఎగిరిన జెండా: అయిదంచెల భద్రత తుత్తునీయలు
- Sports
ఆసీస్ ఆటగాళ్లతో మమ్మల్ని లిఫ్ట్ కూడా ఎక్కనీయలేదు: అశ్విన్
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త చిత్రం 'పరదేశి' గురించి దర్సకుడు బాలా
అలాగే రెడ్ టీ అనే నవలనే పరదేశీగా తెరకెక్కిస్తున్నట్లు ప్రచారంలో ఉన్న విషయం ప్రస్దావిస్తే... ఆ నవలలోని ప్రధానాంశాన్ని మాత్రం తీసుకుని అందులో పరదేశి చేర్చి రూపొందిస్తున్నాను. వంద చిత్రాలతో పొందే అంతస్తును అధర్వ మూడవ చిత్రంతో పొందగలడని భావిస్తున్నాను. ఇందులో మీరు ఊహించని అంశాలే ఉంటా యి. నేను మినహా ఈ చిత్రంలో ఇంచుమించు అందరూ కొత్తవారే. కెమెరామెన్ సెళియన్ నుంచి ఎడిటర్ కిషోర్ వరకు అందరూ నూతన సాంకేతిక వర్గమే అన్నారు.
దక్షిణ తమిళనాడు బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'నాన్ కాదవుల్' చిత్రానికి బాలాతో పనిచేసిన రచయిత జియావిన్ బాలాకు రచన సహకారమందిస్తున్నారు.'నాన్ కాదవుల్' చిత్రంలో నటించిన పూజా 'పరదేశి' చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది. పరదేశి చిత్రం రియల్ లైప్ ఇన్సిడెంట్స్ తో 1940నాటి కథతో జరుగుతోంది. అధర్వ మురళి హీరోగా చేస్తున్నాడు. ఈ చిత్రం సాలూర్,మన్నముదురై,మున్నారు,తలైవార్ వంటి ప్రదేశాలల్లో షూటింగ్ జరిగింది. అక్కడ అటవీ ప్రాంతాలు,కేరళ లేని కొన్ని ప్రత్యేకమైన లొకేషన్స్ లో ఈ చిత్రం షూటింగ్ చేసారు.
ఇక తన చిత్రాల స్పూర్తి గురించి వివరిస్తూ... నా వరకు చెప్పాలంటే కథ అంటూ ఏమీ ఉండదు. పాత్రలే. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం, బాధ, విజయం వీటి చుట్టూ జరిగే సంఘటనలే సినిమాకు మూలాధారం. ఇరుటింట ఆత్మ అనే చిన్న మల యాళ కథనే సేతు చిత్ర రూపకల్పనకు ప్రేరణ. రానాథపురం నా కంట పడ్డ ఒక శరణార్థుల శిబిరమే నంద చిత్రానికి నాంది. జయకాంత్ రాసిన నంద వనత్తిల్ ఒరు ఆంటి నవలే పితామగన్ చిత్రానికి స్ఫూర్తి. కమల్ నటించిన అన్భే శివం జయమోహన్ నవల ఎలామ్ ఉలగం, కాశిలో చూసిన అఘోరంలో అమానుష సంఘటనలకు ప్రతిరూపమే నాన్ కడవుల్ చిత్రం అన్నారు.