»   » ముస్టోళ్ళ మీద సినిమా ఏంటన్నారు..అయినా

ముస్టోళ్ళ మీద సినిమా ఏంటన్నారు..అయినా

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొదట్లో ఈ కథతో సినిమా తీస్తున్నానని తెలిసిన కొంత మంది... 'యాచకుల మీద సినిమా ఏంటి' అని నవ్వినవారు కూడా వున్నారు. కానీ నేను మాత్రం వాటిని పట్టించుకోలేదు అంటున్నారు ప్రముఖ దర్శకుడు బాలా. ఆయన రూపొందించిన 'నాన్‌ కడవల్‌' (తెలుగులో 'నేనే దేముడ్ని') చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు వరించటంతో మీడియాతో మాట్లాడుతూ పై విధంగా చెప్పుకొచ్చారు. అలాగే తన గురువు బాలు మహేంద్ర విడుదలకు ముందే 'నాన్‌కడవల్‌' (తెలుగులో 'నేనే దేముడ్ని') సినిమా చూడగానే " చాలా అద్భుతంగా చేశావు.. ప్రతి సన్నివేశం హృదయానికి హత్తుకునే విధంగా వుంది. అనాథలని, వికలాంగులని, అష్టావక్రులని తమ స్వార్థం కోసం కొందరు ఎలా వాడుకుంటారో చాలా బాగా చూపించావు. తమిళ సినీ పరిశ్రమ గర్వించే సినిమా తీశావు. తప్పకుండా ఈ సినిమా జనాదరణ పొందుతుంది. నీకు దర్శకునిగా అవార్డు వస్తుంది' అని చెప్పి నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారని చెప్పుకొచ్చారు. ఇక ఈ అవార్డును నా గురువు బాలు మహేంద్రకూ... నా భార్య అలకు అంకితం చేస్తున్నాను అన్నారు. అంతేగాక ఈ అవార్డ్‌ నాతో పాటు వైవిధ్యంగా సినిమా తీయాలని తపించే వందలాది మంది అసిస్టెంట్‌ దర్శకులకు మంచి ప్రోత్సాహన్నిస్తుందంటూ అభిప్రాయపడ్డారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X