»   »  బాలా నెక్ట్స్ చిత్రం టైటిల్,హీరో,పోస్టర్

బాలా నెక్ట్స్ చిత్రం టైటిల్,హీరో,పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : బాలా కొత్త చిత్రం కోసం అభిమానులు ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. ఇటీవల 'పరదేశి'తో అలరించిన ఆయన.. తాజాగా విజయ్‌సేతుపతిని తనదైన శైలి హీరోగా మార్చనున్నాడు. ఈ చిత్రానికి 'వసంత కుమారన్‌'గా నామకరణం చేశారు. ఈ కాంబినేషన్‌లో వస్తున్న తొలిచిత్రమిది. ఆనంద కుమరేశన్‌ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు,దర్శకత్వం సమకూర్చుతున్నారు. బాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పోస్టర్ మీరు ప్రక్కన చూస్తున్నది.

దర్శకుడు మాట్లాడుతూ.. ''ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఓ అందమైన ప్రేమ కథను కుటుంబ నేపథ్యంతో తెరకెక్కిస్తున్నాం. తప్పకుండా ఇది జనరంజకంగా ఉంటుంది''అని తెలిపారు. చిత్రీకరణ ఒకట్రెండు రోజుల్లో చెన్నైలో ప్రారంభం కానుంది. జస్టిన్‌ ప్రభాకరణ్‌ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: దినేష్‌ కృష్ణన్‌, ఎడిటింగ్‌: గోవింద్‌.

Director Bala and Vijay Sethupathy are combining together

ఇక ప్రముఖ తమిళ దర్శకుడు బాలా చిత్రాలంటే ఓ రేంజిలో క్రేజ్. వాస్తవికతకు అద్దంపట్టే ఆయన సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అలాగే ఆయన చిత్రాల్లో నటించాలంటే హీరోలు ఉత్సాహం చూపిస్తారు. ఆయన తాజాగా మరో చిత్రం ప్లాన్ చేస్తున్నారు. అందులో హీరోగా శశి కుమార్ ని తీసుకుంటున్నట్లు సమాచారం. 'నాడోడిగల్‌', 'పొరాలి', 'సుందరపాండియన్‌', 'కుట్టిపులి' ద్వారా కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శశికుమార్‌ త్వరలోనే భిన్నమైన పాత్రతో అదరగొట్టనున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో చిత్రీకరణ రామేశ్వరంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 'పరదేశి' మాదిరిగానే చిత్రీకరణ పూర్తయ్యాక సినిమా విశేషాలను వెల్లడించనున్నట్లు వినికిడి.

హీరోకి తెరపై తిరుగులేని గుర్తింపు ఇస్తాడని దర్శకుడు బాలాకు పేరు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. సూర్య, విక్రం.. వంటి వారికి అలా మంచి సినీ జీవితాన్ని ప్రసాదించాడీ విలక్షణ దర్శకుడు. ప్రతిఒక్కరిలో అసలైన నటుణ్ని వెలికితీసే సత్తా ఆయనలో ఉంది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం శశికుమార్‌ను వరించినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 'పరదేశి'తో మరో వాస్తవిక దృశ్యకావ్యాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు బాలా. తర్వాత విక్రంతో ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలోని 'ఐ'లో విక్రం నటిస్తున్నాడు. ఇదికాకుండా మరో రెండు సినిమాలకు కూడా పచ్చజెండా ఊపాడు. శంకర్‌ సినిమా తర్వాత.. బాలా దర్శకత్వంలో విక్రం మళ్లీ నటించనున్నాడనే వార్తలు ఆమధ్య వినిపించాయి. ఇది కుదరకపోవడంతో ఈ అవకాశం శశికుమార్‌ను వరించింది.

English summary
Vasantha Kumaran movie director Bala and Vijay Sethupathy are combining together. The movie is produced by Bala’s B Studio along with Studio 9 productions, Anand Kumaresanas directing the movie written the story, screen play and dialogues.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu