»   » సినిమా ఆగినా చరణ్ ని నీడలా వెంటాడుతున్న డైరెక్టర్...!?

సినిమా ఆగినా చరణ్ ని నీడలా వెంటాడుతున్న డైరెక్టర్...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ ఇమ్మీడియట్ గా నటించే సినిమా 'రచ్చ"అనే సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వం వహించే ఈ చిత్రం తర్వాత చరణ్ ఓ భారీ యాక్షన్ సినిమా చేయనున్నాడు. వినాయక్ డైరెక్షన్ లో రూపొందే ఈ చిత్రానికి ఆకుల శివ కథ రెడీ చేశాడు, బద్రీనాథ్ షూటింగ్ పూర్తయిన తర్వాత వినాయక్ ఇక చరణ్ చిత్రం పనుల్లో నిమగ్నమవుతాడు.

ఇదిలావుంటే రామ్ చరణ్ చేద్దామనుకుని ఆపేసిన 'మెరుపు" పనులు ఇంకా ఆగలేదు. చరణ్ తో మెరుపు స్టార్ట్ చేసిన తమిళ దర్శకుడు ధరణి ఇప్పటికీ చరణ్ వెంటే ఉంటున్నాడు. మావీరన్ ఆడియో రిలీజ్ కి చరణ్ చెన్నయ్ వెళ్లినప్పుడు కూడా ధరణి అక్కడికి వచ్చాడు. అంతే కాక తమిళ చిత్ర సీమలోనూ అడుగు పెట్టాలని ఉందని చరణ్ అప్పుడే ప్రకటించాడు. త్వరలోనే ఒక పేరున్న తమిళ దర్శకుడితో స్ట్రెయిట్ తమిళ చిత్రంలో నటిస్తున్నట్టు చరణ్ పేర్కొన్నాడు. మెరుపు చిత్రాన్ని తెలుగు, తమిళంలో రూపొందించాలని అనుకుంటున్న చరణ్ ముందుగా 'మగధీర" అనువాదంతో తమిళనాట పేరు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. మావీరన్ కి అక్కడ అనుకూల స్పందన ఉంటే కనుక చరణ్ తమిళనాడుకి కూడా తన మార్కెట్ ని విస్తరించుకోవాలనుకుంటున్నాడు.

English summary
Universal Hero Kamal Hassan has launched has handed over the first copy to Maverick director Mani Ratnam, the invitees list includes the film’s director SS Rajamouli, producer Allu Arvind, Allu Sirish and hero Ram Charan Teja apart them director KS Ravikumar, AM Ratnam, Dharani, Suhasini, Udhayanidhi Stalin and Ramanarayanan were spotted at the launch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu