»   »  స్టార్ డైరక్టర్ కి ఫేస్ బుక్ సమస్య...పోలీస్ కంప్లైంట్

స్టార్ డైరక్టర్ కి ఫేస్ బుక్ సమస్య...పోలీస్ కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ సినిమా వాళ్లకు ఎంతగా ఉపయోగపడుతున్నాయో..అంతగా సమస్యలు సైతం తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఫేస్ బుక్ తో అలాంటి సమస్యే తమిళ స్టార్ డైరక్టర్ హరి(యముడు,సింగం ఫేమ్) కి వచ్చి పడింది. దాంతో ఆయన చెన్నై సిటీ పోలీస్ కమీషనర్ ఎకె విశ్వనాధన్ కి కంప్లైంట్ ఇచ్చారు.

తన పేరుతో ఫేస్ బుక్ ఎక్కౌంట్ ఓపెన్ చేసి, ఇష్టమొచ్చినట్లు రాస్తూ తన పరువు తీస్తున్నారని స్టార్ డైరక్టర్ ఆరోపించారు. అక్కడ రాసే కంటెంట్ తన పేరు,ప్రతిష్టలకు భంగం కలుగుతోందని ఆయన అన్నారు. అలాగే అసలు తనకు ఎక్కౌంట్ లేదని తెలియచేసారు. ఈ మేరకు ఆ ఎక్కౌంట్ ఎవరు ఓపెన్ చేసారనే ఎంక్వైరీ మొదలైంది. త్వరలోనే ఆ ఎక్కౌంట్ మొదలెట్టిన వారిని అరెస్టు చేస్తానని అన్నారు. ప్రస్తుతం విశాల్ హీరోగా ఈ దర్శకుడు పూజై అనే చిత్రం రూపొందిస్తున్నారు.

Director Hari lodges complaint

ఇక ఈ మధ్య విడుదల చేసిన పూజై చిత్ర ఫస్ట్‌లుక్ ఫొటోలకు విశేష ఆదరణ లభించింది. విశాల్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న చిత్రం పూజై. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న మూడవ చిత్రం ఇది. దీనికి కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ దేశంలోని ముఖ్యమైన సమస్యపై హీరో చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధానాంశమన్నారు. దాన్ని కుటుంబ నేపథ్యంలో చక్కని ప్రేమ సన్నివేశాలను జోడించి చిత్రీకరిస్తున్నామని చెప్పారు.

ముక్కోణపు ప్రేమ కథలా ఇది ముక్కోణపు యాక్షన్ కథా చిత్రమని తెలిపారు. గత చిత్రాల మాది రిగానే ఈ పూజైలోను జనరంజక అంశాలు ఉంటాయని వివరించారు. ఇంతకుముందు విశాల్ హీరోగా చేసిన తామరభరణి చిత్రం పూర్తిగా యాక్షన్ ఓరియంటెండ్ కథా చిత్రం కాదన్నారు. పూజై మాత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కథా చిత్రమన్నారు.

ఈ చిత్ర కథ కోయంబత్తూరు నేపథ్యంలో సాగుతుందన్నారు. పూజై చిత్రానికి అందమైన హీరోయిన్ అవసరం అయ్యారని చెప్పారు. అలాంటి మోడ్రన్ లుక్, ఫ్రెష్‌నెస్ టచ్‌కు శ్రుతిహాసన్ కరెక్టుగా ఉంటుందని భావించి, ఆమెను ఎంపిక చేశామని చెప్పారు. చిత్రంలో శ్రుతిహాసన్ పాత్ర ఆరంభం నుంచి చివరి వరకు ఉంటుందని దర్శకుడు హరి పేర్కొన్నారు.

English summary
Director Hari lodged a complaint with the City Police Commissioner seeking action against those who run an account on a social networking on his name and post objectionable content. Such content had tarnished his reputation, he said. He had no account whatsoever in the popular social networking site, he added. The Police have begun inquiries.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu