»   » అనుష్క దర్శకుడుకి 'స్వల్ప గుండెపోటు'

అనుష్క దర్శకుడుకి 'స్వల్ప గుండెపోటు'

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  చెన్నై : అనుష్క తో ప్రస్తుతం వర్ణ చిత్రం డైరక్ట్ చేస్తున్న సెల్వరాఘవన్ కి ఇటీవల గుండె నొప్పి వచ్చిందిట. కుటుంబీకులందరూ కంగారుపడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని చెబుతున్నారు. అయితే అది మీడియాలో రాలేదు. కానీ రీసెంట్ గా ఆయన స్వయంగా ఈ విషయాన్ని తెలియచేసారు. ఆయన మాట్లాడుతూ... పీల్చిన పొగకు, తాగిన మందుకు ఎప్పటికైనా సమాధానం చెప్పాల్సిందే. అలాంటి పరిస్థితే ఇటీవల నాకు ఎదురైంది. కొద్దిరోజుల కిందట కారు డ్రైవ్‌ చేస్తుండగా ఉన్నట్టుండి చెమటలు పట్టాయి. శరీరంలో వణుకు పుట్టింది. వెంటనే డాక్టర్‌కు ఫోన్‌ చేసి ఆస్పత్రికి వెళ్లా. కొద్దిరోజుల పాటు శరీరం మొత్తం పరీక్షించారు. 'స్వల్ప గుండెపోటు!' అని చెప్పారు. పొగతాగడం పూర్తిగా ఆపేయమన్నారు. రెండువారాలుగా పూర్తిగా మానేశా. పార్టీ, పొగ లేని జీవితం చాలా ఆనందంగా ఉందిప్పుడు. ఇలాంటి చక్కటి జీవితాన్ని వదిలేసి ఇంతకాలం పక్కదారి పట్టానన్న ఆవేదన కలుగుతోంది అన్నారు.

  భిన్నమైన ప్రేమకథా చిత్రాల చిరునామా.. సెల్వరాఘవన్‌. 'తుల్లువదో ఇలమై', 'కాదల్‌ కొండేన్‌', '7/జీ బృందావన కాలనీ', 'ఆయిరత్తిల్‌ ఒరువన్‌'.. వంటి వైవిధ్య సినిమాలను అందించి గుర్తింపు సాధించాడు. తక్కువ చిత్రాలతోనే అగ్ర దర్శకుడనే పేరు సొంతం చేసుకున్నాడు. తమ్ముడితో 'మయక్కం ఎన్న' రూపొందించి చతికిలపడిన సెల్వ ప్రస్తుతం ఆర్యతో 'ఇరండాం ఉలగం'(వర్ణ)ను సృష్టిస్తున్నాడు. ఇందులో అనుష్క హీరోయిన్ . భారీ సాంకేతిక హంగులతో సిద్ధమవుతోంది. ఇటీవలే ఆడియో విడుదలై సంగీతాభిమానులను అలరిస్తోంది. సినిమా థియేటర్లలోకి రాకముందే రాంజీ కెమెరా పనితనాన్ని యూనిట్‌ అభినందిస్తోంది. వచ్చేనెలలో తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.

  'వర్ణ' కథ గురించి చెప్తూ... ప్రేమించేవారికి ఓ ప్రపంచం ఉంటుంది. ప్రేమించని వారిది మరో లోకం. ఇప్పటి వరకు ప్రేమకు సంబంధించి భిన్నమైన కథల్ని అందించా. మరెన్నో వైవిధ్యమైన కథలు కోలీవుడ్‌లో వచ్చాయి. కొత్త అంశాన్ని చూపాలనే 'వర్ణ' తెరకెక్కిస్తున్నా. ఇదో సాహసోపేతమైన ప్రేమకథ అన్నారు.

  'ఆయిరత్తిల్‌ ఒరువన్‌' (యుగానికొక్కడు) చిత్రం ఆశించిన విజయం సాధించలేదు ..ఈ విషయం చెప్తూ.... నేను తెరకెక్కించిన ప్రతి సినిమాకు విడుదలైన కొత్తలో ఏదో ఒక సమస్య చెప్పి రగిలిస్తుంటారు. ప్రశ్నలవర్షం కురిపిస్తారు. ఆ చిత్రం ప్రేక్షకులను రంజింపజేస్తుంది. ఆఫ్రికా దీవుల్లోని నల్లజాతివారు ఆంగ్లంలో మాట్లాడేలా తెరకెక్కిస్తారే.. అది తప్పుకాదా?, మన సినిమా కథనే 'అవతార్‌'గా మనకే చూపించిన గొప్పోళ్లను మీ నోళ్లు ప్రశ్నించవా?.. ఇదే నా బాధ. ప్రస్తుతం 'ఇరండాం ఉలగం' పూర్తయింది. విడుదలయ్యాక విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నా. కుటుంబం, పిల్లలతో కాలం గడిపేయాలనుంది అన్నారు.

  English summary
  Selvaraghavan, better known as Sriraghava in Tollywood circuits, is the man we are talking about. Due to excessive smoking and alcohol consumption it is heard that he suffered with a stroke a couple of weeks back. However after getting an Angiogram done and with medication, he is back to normal as his condition is never critical. But still doctors insisted Selva to take a break from work for which our director is not ready. Boldly, he started working on the post production of Arya-Anushka starrer ‘Varna’. But the good thing is that this talented director has now quit both smoking and drinking.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more