మణిరత్నంకు బాంబు బెదిరింపు.. చంపేస్తామని హెచ్చరిక
ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు బాంబు బెదిరింపు రావడం తమిళ సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. బెదిరింపుల నేపథ్యంలో చెన్నైలోని ఆయన కార్యాలయానికి భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రం సక్సెస్‌తో దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపు రావడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

డైలాగ్స్‌ను తొలగించాలని
నవాబ్ తమిళ వెర్షన్ చెక్క చివాంత వానమ్ చిత్రంలో అభ్యంతరకరమైన డైలాగ్స్ ఉన్నాయని, వాటిని తొలగించకపోతే చంపేస్తామని అగంతకులు హెచ్చరించారు. చెన్నైలోని అభిరామపురంలోని మణిరత్నం కార్యాలయం ఆఫీస్‌ను పేల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

మణిరత్నంకు సెక్యూరిటీ
బాంబు బెదిరింపుల వార్నింగ్ రావడంతో మణిరత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో చెన్నై పోలీసులు రంగంలోకి దూకారు. అగంతకులు చేసిన ఫోన్‌కాల్‌పై ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆయన ఇంటికి, కార్యాలయం వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

కుటుంబ కలహాల నేపథ్యంగా
సేనాతిపతి (ప్రకాశ్ రాజ్) అనే రియల్టర్, మాఫియా కుటుంబానికి సంబంధించిన కథను మణిరత్నం తెరకెక్కించారు. సేనాతిపతి కొడుకులుగా అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబు నటించారు. కుటుంబం అంతర్గత కలహాలను తనదైన శైలిలో చిత్రీకరించారు.

రూ.50 కోట్ల క్లబ్‌లోకి
చెక్కా చివంతా వానమ్ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. తొలి రోజునే తమిళనాడులో రూ.89 లక్షల రూపాయలు వసూలు చేసింది. ప్రస్తుతం రూ.50 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతున్నది.


Click it and Unblock the Notifications











