For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డైరక్టర్ కి ఆరోగ్యం బాగోలేదు, కమల్ ది సరైన నిర్ణయమే

  By Srikanya
  |

  హైదరాబాద్: ఇంతకుముందు 1989లో కమల్‌ - టీకే రాజీవ్‌ల కాంబినేషన్‌లో 'చాణక్యన్‌' అనే హిట్‌ సినిమా వచ్చింది. 26 ఏళ్ల తరువాత అదే కలయికతో మరో చిత్రం రాబోతోంది. ఆ చిత్రమే 'శభాష్‌నాయుడు'. కొన్ని రోజుల క్రితమే లాస్‌ఏంజిల్స్‌లో షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. అయితే ఆఖరి నిమిషంలో దర్శకుడు మారారు. కమల్ మెగాఫోన్ పట్టారు. అయితే ఈ విషయమై రకరకాల రూమర్స్ బయిలు దేరాయి.

  కమల్ కు ఇలా డైరక్షన్ లో వేలు పెట్టడం కొత్తేమి కాదని, గతంలోనూ తను చాలా సార్లు సినిమాల తన సినిమాలు డైరక్ట్ చేసేవారని, వేరే డైరక్టర్ ని పెట్టుకున్నా కమల్ తో వేగటం కష్టంగా ఉండేదని చెప్పుకునేవారు. అలాగే ఈ ప్రాజెక్టులోనూ దర్శకుడుకు, కమల్ కు క్రియేటివ్ డిఫెరెన్సెస్ వచ్చాయని, అందుకే కమల్ మెగా ఫోన్ పట్టాడన్నారు. అయితే ఈ విషయమై కమల్ వివరణ ఇచ్చారు.

  దర్శకుడు టీకే రాజ్‌కుమార్‌ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవ్వడంతో తొలి షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్న పాట కోసం కమల్‌ మెగాఫోన్ పట్టినట్టు చెప్పుకొచ్చారు. అయినా సోషల్ మీడియాలో కమల్ ని ట్రోల్ చేయటం మానలేదు. అనారోగ్యం అనేది కేవలం అందరిని మభ్యపెట్టడానికే అన్నారు.

  అయితే అందుతున్న సమాచారం ప్రకారం..ఈ విషయంలో కమల్ నిజమే చెప్పారు. దర్శకుడు లైమ్ డిసీజ్ తో బాధ పడుతున్నారట. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజీవ్‌కుమార్‌ పూర్తిగా కోలుకున్నాక మళ్లీ ఆయనే కెప్టెన్ భాద్యతను తీసుకోనున్నారట.

  ఈ డిసీజ్ వచ్చినవారికి బాక్టీరియా ద్వారా శరీరం అంతా రాషెష్ లాగ వస్తుంది. అది చాలా బాధాకరణంగా ఉంటుంది. ప్రస్తుతం దర్శకుడు యుఎస్ ఎ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈలోపు కమల్‌హాసన్ తనదైన శైలిలో 'శభాష్‌నాయుడు'ని తెరకెక్కించనున్నారు.

  కమల్ ...ఇంగ్లీష్ డైలీ దక్కన్ క్రానికల్ తో మాట్లాడుతూ.. "మా దర్శకుడు బాగా అనారోగ్యం పాలయ్యారు, మేము లాస్ ఎంజిల్స్ ఉన్న నాలుగోరోజు ఈ అనుకోని విధంగా జరిగింది.. ఈ అనారోగ్యం లైమి డిసీజ్ అని డయోగ్నోస్ చేసారు. ఈ అనారోగ్యం...యూరప్, నార్త్ అమికాలో ఉన్నవారికి వస్తూంటుంది. దాంతో నేను సినిమాని డైరక్ట్ చేస్తున్నాను ," అన్నారు.

  మిగతా విశేషాలు స్లైడ్ షో ద్వారా...

  బెస్ట్ హాస్పటల్ లో

  బెస్ట్ హాస్పటల్ లో

  మా దర్శకుడుని అమెరికాలోని బెస్ట్ హాస్పటిల్ లో ఉంచి ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నాం , మా ఎగ్జిక్యూవ్స్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.

  గెట్ వెల్ కార్డ్

  గెట్ వెల్ కార్డ్

  హాస్పటిల్ లో ఆయన వెనకాల మా యూనిట్ అంతా సైన్ చేసిన గెట్ వెల్ సూన్ కార్డ్ ఉంచాం అన్నారు కమల్.

  అవును...చేసాను

  అవును...చేసాను

  నేను గతంలోనూ ఇలా డైరక్షన్ మధ్యలో హ్యాండోవర్ చేసుకున్నాను. అయితే ఈ సారి స్టాండ్ బై డైరక్టర్ గా ఉండదలిచాను. నా ఫ్రెండ్ త్వరగా రికవరీ అవుతారని భావిస్తున్నాను అన్నారు కమల్

  టైట్ షెడ్యూల్

  టైట్ షెడ్యూల్

  ఈ సినిమా కు లాస్ ఏంజిల్స్ నూ తర్వాత టైట్ షెడ్యూల్ ప్లాన్ చేసాం. జూలై చివరకు సినిమాని పూర్తి చేసి, ఆగస్టు మొదటి వారంలో మిగతా కార్యక్రమాలు చేయాలనిఅనున్నాం అని చెప్పారు.

  నాతోనే మొదలు

  నాతోనే మొదలు

  రాజీవ్ నాతోనే పాతిక సంవత్సరాల క్రితం దర్శకుడుగా కెరీర్ మొదలెట్టారు. ఆయన కోలుకుని ఎన్నో సినిమాలు డైరక్ట్ చేస్తారని నమ్మకం ఉంది.

  ఇప్పటికే పాతిక

  ఇప్పటికే పాతిక

  ఇప్పటికే రాజీవ్ ..ఆయన కెరీర్ లో పాతిక సినిమాలు చేసారు. మరో పాతిక సినిమలు ఖచ్చితంగా చేస్తారు. అందులో కనీసం పదింటిలో అయినా నేను ఉంటాను అన్నారు కమల్ హాసన్ ఎమోషనల్ గా..

  రెగ్యులర్ షూట్

  రెగ్యులర్ షూట్

  దర్శకుడు ఆరోగ్యం కోసం హాస్పటిల్ లో టీమ్ ని ఉంచుతూనే, కమల్ రెగ్యులర్ షూటింగ్ ని కొనసాగిస్తున్నారు.

  స్పూర్తితో ..

  స్పూర్తితో ..

  ‘దశావతారం'లో బలరామ్‌నాయుడు పాత్ర స్ఫూర్తితో ‘శభాష్‌నాయుడు' స్క్రిప్టు రూపొందించారు.

  జోడీ

  జోడీ

  ఇందులో కమల్‌కు జోడీగా రమ్యకృష్ణ, వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో చాలా చిత్రాలు వచ్చాయి. పంచతంత్రలో చివరి సారిగా కమల్ సినిమాలో రమ్యకృష్ణ కనిపించారు.

  అలాగే..

  అలాగే..

  కమల్ కు నిజ జీవితంలో కూతురైన శ్రుతిహాసన్ ఈ సినిమాలో కమల్ కు కూతురుగా నటిస్తున్నారు.

  ఇళయరాజా

  ఇళయరాజా

  గతంలో సంగీత జ్ఞాని ఇళయరాజా, కమల్ కాంబినేషన్ లో సూపర్ హిట్స్ వచ్చాయి. మరోసారి ఇళయరాజా ..కమల్ సినిమాకు బాణీలు కడుతున్నారు.

  మూడు భాషల్లో...

  మూడు భాషల్లో...

  తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోను ఈ చిత్రం తెరకెక్కుతోంది.

  గెట్ వెల్ సూన్

  గెట్ వెల్ సూన్

  వన్ ఇండియా తెలుగు..ఈ దర్శకుడు త్వరగా కోలుకుని శభాష్ నాయుడు చిత్రం ని తీసుకుని పూర్తి చేయాలని కోరుకుంటోంది.

  English summary
  Recently, there were reports claiming that director TK Rajeev Kumar had walked out of Kamal Haasan's upcoming project Sabhash Naidu, because of creative differences with the Viswaroopam actor and that Kamal himself will helm the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X