»   » 'కబాలి': నెగిటివ్ రివ్యూ లు,టాక్ పై దర్శకుడు స్పందన,నావల్ల కాదు

'కబాలి': నెగిటివ్ రివ్యూ లు,టాక్ పై దర్శకుడు స్పందన,నావల్ల కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రజనీకాంత్ తాజా చిత్రం కబాలి మొన్న శుక్రవారం విడుదలయ్యి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. టీజర్ లో ఉన్న దాంట్లో సగం కూడా సినిమాలో లేదని, రంజిత్ చాలా లైట్ తీసుకుని రజనీ సినిమా చేసాడని, ఆయన ఇమేజ్ ని ప్రక్కనపెట్టిన తన పైత్యంతో సినిమా తీసాడని రకరకాల వ్యాఖ్యానాలు అంతటా వినిపించాయి.

అయితే ఈ విమర్శలపై వెంటనే దర్శకుడు రంజిత్ స్పందించాడు. ఆయన తమిళ మీడియాతో మాట్లాడుతూ...అందరి డైరక్టర్లు లాగ తాను రజనీ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని ఆలోచనతో కబాలి సినిమాలేదని , ఓ భిన్నమైన సినిమా ట్రై చేసానని అన్నారు. ఇంకా ఆయనేం మాట్లాడారో క్రింద స్లైడ్ షోలో చదవండి.


అలాగే తనని తన శ్రేయాబిలాషులంతా సినిమా అద్బుతంగా వచ్చిందని, క్లైమాక్స్ ,పొలిటికల్ కంటెస్ట్, క్యారక్టర్స్ డిజైన్ బాగుందంటున్నారని చెప్తున్నారని ఆనందంగా చెప్పారు. అలాగే రజనీకాంత్ సైతం సినిమా చూసాక...ఇది రెగ్యులర్ రజనీ సినిమా కాదు, భయపడకు, నువ్వు ఇది అభిమానులకు ఇచ్చావు. వాళ్లు దాన్ని ఖచ్చితంగా ఇష్టపడతారు అని అన్నారని చెప్పారు. ఇక సినిమా చూసాక రజనీ చాలా హ్యాపీ ఫీలయ్యారని అన్నారు.


అయితే అఫ్ కోర్స్ ఇప్పుడు రంజిత్ చెప్పిన ఈ మాటలపై కూడా విమర్శలు మొదలయ్యాయి. సినిమా బాగోలేదు అంటే నా ఇష్టం వచ్చినట్లు తీసాను అని దర్శకుడు సమర్దించుకోవటం పద్దతి కాదని, రజనీవంటి స్టార్ ని డీల్ చేసే సత్తా లేనప్పుడు ఎందుకు ఆయన తో సినిమా చేసావని సోషల్ మీడియాలో ఓ రేంజిలో మండిపడుతున్నారు.


స్లైడ్ షోలో రంజిత్ ఇంకేమన్నారో చూడండి...


తిట్టారు కూడా

తిట్టారు కూడా

కబాలి విషయంలో నన్ను ఎంతమంది పొగడారో , అంతమంది తిట్టారు కూడా.


అన్ని వింటాను

అన్ని వింటాను

నేను ఎవరి అభిప్రాయమైనా వింటాను. అన్ని చోట్లా సినిమా గురించి వస్తున్న పొగడ్తలని, విమర్శలను గమనిస్తూనే ఉన్నాను.


రియలిస్టిక్ గా

రియలిస్టిక్ గా

నేను సినిమాని వీలైనంత రియలిస్టిక్ గా తీయాలని ముందునుంచే అనుకున్నాను. అలాగే తీసాను


హంగు ఆర్బాటాలు లేకుండా

హంగు ఆర్బాటాలు లేకుండా

రియలిస్టిక్ సినిమా తీసే ప్రాసెస్ లో నేను సినిమాలో అనవసర హంగు ఆర్భాటాలు ఏమీ లేకుండా చూసుకున్నాను


క్యాష్ చేసుకోదల్చుకోలేదు

క్యాష్ చేసుకోదల్చుకోలేదు

రజనీసార్ ఇమేజ్ ని మాత్రమే క్యాష్ చేసుకునేలా కొన్నాళ్లుగా సినిమాలు వచ్చాయి. నేను అందుకు భిన్నంగా తీయాలని పిక్స్ అయ్యా.


నటుడిని తేవాలని

నటుడిని తేవాలని

రజనీకాంత్ లో ఉన్న అద్బుతమైన నటుడుని బయిటకు తేవాలనే ప్రయత్నించాను


ఇవే సులభం

ఇవే సులభం

కమర్షియల్ సినిమాల కన్నా రియలిస్టిక్ సినిమాలు తీయటమే చాలా సులువు. నేను అవే ఇష్టపడతాను


ఎక్కువ అబద్దాలు

ఎక్కువ అబద్దాలు

కమర్షియల్ సినిమాల్లో ఎక్కువ అబద్దాలు చెప్తూంటాం. అవి నా వల్ల కాదు


గ్లిజరిన్ వాడలేదు

గ్లిజరిన్ వాడలేదు

ఎమోషన్ సీన్స్ లో ముఖ్యంగా తన భార్య కుందనవల్లిని చాలా ఏళ్ల తర్వాత కలిసేటప్పుడు రజనీ,రాధిక కళ్లలో నీళ్లు కపడతాయి. అయితే అప్పుడు ఇద్దరూ కూడా గ్లిజరిన్ వాడలేదు. మొదట మేం రాధిక సింగిల్ షాట్ తీసాం. తర్వాత రజనీ సార్...దాన్నిక్లోజ్ గా వాచ్ చేసారు. తర్వాత షాట్ లో సీన్ లో కు ఆయన వచ్చి దాన్ని ఎక్కడికో తీసుకువెళ్లారు తన నటనతో అని వివరించాడు దర్శకుడు.


అభిమానులు మాత్రం

అభిమానులు మాత్రం

సినిమా గొప్పగా ఏంలేదని, 'కబాలి' తీవ్ర నిరాశకు గురిచేసిందని, డబ్బులు తిరిగిచ్చేయాలని కొందరు ప్రేక్షకుడు వాపోతున్నారు. ఇలాంటి చెత్త సినిమా తీసిన దర్శకుడు పా రంజిత్ ను క్షమించలేమంటూ ప్రేక్షకులు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'కబాలి'ని 'లింగా' సోదరుడిగా పోలుస్తున్నారు.


English summary
“It is simple and easy to make a realistic film. I find it more difficult to make a commercial film, where you have to sell lies and try to make them sound convincing. It is so much better to write about real-life experiences.” Said director P.a. Ranjit.Pa. Ranjith on the experience of making Kabali after its release
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu