»   »  తాప్సీ పై డైరక్టర్ సీరియస్..క్షమాపణ

తాప్సీ పై డైరక్టర్ సీరియస్..క్షమాపణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: అత్యుత్సాహం ఎప్పుడూ మనుష్యులను సమస్యల్లో పడేస్తుంది. అలాంటిదే హాట్ బ్యూటీ తాప్సీ కి ఎదురయ్యింది. ఆమె రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో మీడియా వారికి ఉత్సాహంతో తమ చిత్రం కథని కొద్దిగా లీక్ చేసేసింది. ముఖ్యంగా తను చేస్తున్న పాత్ర గురించి చెప్పేసింది. ఇది ఆ దర్శకుడుకు మండి సీరియస్ అవటం, చివరకి తాప్సీ సారి చెప్పటం వరసగా జరిగిపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

శింబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఖాన్. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ, క్యాథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఖాన్ చిత్రం ఇంటిల్‌జెన్సీ విభాగానికి చెందిన కథ అనీ, తానిందులో ఇంటిల్‌జెన్సీ అధికారిగా నటిస్తున్నట్లు గొప్పగా చెప్పేశారట. దీంతో దర్శకుడు సెల్వరాఘవన్ తాప్సీకి ఫోన్ చేసి మరీ క్లాస్ పీకాడట. చివరకు తాప్సీ క్షమాపణ చెప్పుకున్నట్లు సమాచారం.

ఇక కొద్ది రోజుల క్రితం తాప్సీ తెలుగు సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తాప్సీ మాట్లాడుతూ ‘‘ఏ నటినైనా తెలుగు సినిమా స్పాయిల్‌ చేస్తుంది. ఎందుకంటే టాలీవుడ్‌లో హీరోయిన్లను మహారాణుల్లా చూస్తాను. కేర్‌వ్యాన్‌ నుంచి నాయిక దిగడమే ఆలస్యం.. అందరూ అటెన్షన్‌గా ఉంటారు. లేచి నిలబడతారు. షాట్‌ పెట్టిన చోటుకి నాయిక వెళ్లేవరకు ఎవరూ కూర్చోరు. అంతటి ఆరాధనను కనబరుస్తారు. నిజంగా ఐ లవ్‌ దట్‌ అటెన్షన్‌. ఐ మిస్‌ దట్‌ ఆల్సో'' అని చెప్పుకొచ్చింది.

Director Selvaraghavan scolds Taapsee for extra revelation

హృతిక్‌ రోషన్‌తో నటించాలని, మణిరత్నం దర్శకత్వంలో పనిచేయాలని ఉందని, తన కల త్వరలోనే నెరవేరాలని కోరుకుంటున్నట్టు వివరించిందీ సుందరి.

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అనిపించుకోవాలని విశ్వప్రయత్నం చేసి విసుగెత్తిపోయిన తాప్సీ... ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్‌లలో బిజీగా ఉంటోంది. ఇటీవలే తమిళంలో కాంచన3 చిత్రంతోనూ, హిందీలో బేబీ సినిమాతోనూ హిట్స్ అందుకుని మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సొట్టబుగ్గల సుందరి.. ఇకపై అయినా కాస్త పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ, అమ్మడు ఉన్నట్లుండి బిజినెస్ చేసేస్తానంటూ జనాలకు షాక్ ఇచ్చింది.

అనడమే కాదు.. తన ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టేసి... సక్సెస్‌ను కూడా అందుకుందట అమ్మడు. ఈ విషయాన్ని తాప్సీనే స్వయంగా వెల్లడించడం మరో విశేషం. ఇటీవలే వెడ్డింగ్ ఈవెంట్ ప్లానర్‌గా కొత్త అవతారం ఎత్తిన తాప్సీ... చెల్లితో కలసి ఓ పెళ్లిని ఘనంగా నిర్వహించిందట. అయితే దీనికి అందరూ అభినందనలు తెలపాల్సింది పోయి.. సినిమాల్లో అమ్మడు జోరు తగ్గడం వల్లే సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసిందని సెటైర్లు వేస్తుండటంతో.. తాప్సీకి అరికాలి మంట నెత్తికెక్కిందట.

ఇక అసలే అమ్మడి నోటికి కాస్త దురుసు ఎక్కువేమో... వెంటనే దీనిపై ఓ స్టేట్మెంట్ ఇచ్చేసింది. సినీ కెరీర్ పట్ల తనకు ఎటువంటి ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ లేదని స్పష్టం చేసిన తాప్సీ... కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతోనే వ్యాపారంలోకి అడుగుపెట్టానని క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాదు.

ప్రస్తుతం తనకు సినిమా ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయని తెలిపింది. ఏమైనా... మన క్యూట్ బ్యూటీ రెండు పడవల ప్రయాణాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకుందట. మరి.. తాప్సీ ప్లానింగ్ ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందో చూడాలి.

English summary
Recently Taapsee revealed that she plays a RAW agent in her upcoming film with Simbu which is being directed by Selvaraghavan. All these details have upset Selva. Calling Taapsee on this issue, he has scolded the actress for her erratic behaviour.
Please Wait while comments are loading...