»   » హీరోయిన్ చెంప పగలకొట్టాడు...గొడవ

హీరోయిన్ చెంప పగలకొట్టాడు...గొడవ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారిన అంశం హీరోయిన్ ప్రియాంకను దర్శకుడు కళంజియం కొట్టాడనే విషయం. ఆయన లెంప పగలకొట్టడంతో ఆమె సొమ్మసిల్లిపడిపోయిందని, దీన్ని వదిలిపెట్టనని ఆమె తండ్రి సీరియస్ అవుతున్నారు. ఈ విషయాన్ని ఆర్టిస్టుల అశోశియేషన్ కి తీసుకువెళ్తానంటున్నారు. అయితే ఆమెను ఎందుకలా కొట్టాల్సి వచ్చిందీ అంటే...

వివరాల్లోకి వెళితే... దర్శకుడు కళంజియం తమిళ చిత్రం Kodai Mazhaiషూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయన నటుడు కూడా కావటంలో ఈ చిత్రంలో ఓ వేషం కూడా వేస్తున్నాఆ సీన్ డిమాండ్ మేరకు ఓ రైతుని చాచిపెట్టి కొట్టాలి. దాని కోసం రిహార్సిల్ చేసారు కూడా. షాట్ రెడి చెప్పి ఆయన కెమెరా ముందుకు వచ్చి రైతు వేషం వేసిన నటుడుని కొట్టబోయాడు. అయితే సరిగ్గా అదే సమయానికి అడ్డంగా వచ్చిన ప్రియాంకకు తగిలింది. దెబ్బ గురి తప్పి తగలటంతో ఆమె వెంటనే స్పృహ తప్పింది.

Director slaps actress; dad alleges indifference

దాంతో కంగారుపడ్డ టీమ్...ఆమెను హాస్పటిల్ కి తీసుకు వెళ్లారు. ఆమె కు ప్రమాదమేమీ లేదు డిచ్చార్జ్ చేసారు కానీ..ఆమె తండ్రి మాత్రం చాలా సీరియస్ అవుతున్నారు. తన కూతురు ఇమేజ్ కి ఇది దెబ్బ అని వాదిస్తున్నారు. పొరపాటు అనేది ఆయన ఒప్పుకోవటం లేదు. దర్శకుడు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. అశోశియేషన్ కి తీసుకువెళ్లి తేలుస్తున్నంటున్నాడు ఆమె తండ్రి. చివరకు ఇది ఎక్కడికి చేరనుందో అనేది చర్చనీయాంశంగా మారింది.

English summary
Actress Priyanka fainted on the set of Kodai Mazhai when director turned-actor Mu Kalanjiyam slapped her. The slap landed close to her ear and the actress passed out on the spot, and remained in that state for almost two hours.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu