twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవమానకరంగా ఉంది : దర్శకుడిపై తీవ్ర స్దాయిలో మండిపడ్డ రానా దగ్గుబాటి !

    దర్శకుడు రానా తాజాగా ట్విట్టర్ లో దర్శకుడు సూరజ్ పై మండిపడ్డారు.

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''హీరోయిన్స్ కోట్లకు కోట్లు డబ్బులు తీసుకుంటున్నారు. అందుకని వాళ్లు ఒంటి నిండా బట్టలు వేసుకోవడానికి వీలు లేదు''... అంటూబహిరంగంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చి, తమిళ దర్శకుడు సురాజ్‌ ఇప్పుడు ఇరుకున పడ్డారు. విశాల్, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం ఒక్కడోచ్చాడు. ఈ శుక్రవారం రిలీజైన ఈ చిత్రాన్నిసూర‌జ్ తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ్ లో రూపొందిన ఈ చిత్రం స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది.

    ఒక్కడోచ్చాడు ప్ర‌మోష‌న్ లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో డైరెక్ట‌ర్ సూర‌జ్ హీరోయిన్స్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల ఒక స్వతంత్ర యూ ట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సురాజ్ ..హీరోయిన్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రెమ్యూనరేషన్ కోసమే గ్లామరస్ పాత్రల్లో నటించడానికి ఇష్టపడతారని వ్యాఖ్యానించాడు.

    డైరెక్టర్ సురాజ్ వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని, ఈ అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు సురాజ్ తనకు, పరిశ్రమలోని అందరు ఆడవాళ్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఆమెకు మద్దతుగా స్టార్ హీరోయిన్ నయనతార, ఇతరులు నిలవడంతో దర్శకుడు సురాజ్ అందరికీ లేఖ ద్వారా క్షమాపణలు తెలిపాడు. ఈ విషయాన్ని తాజాగా తెలుకున్న నటుడు, బాహుబలితో నేషనల్ లెవల్ కు ఎదిగిన రానా ట్విట్టర్ తో తెలియచేసాడు.

    ద్వారా 'ఇప్పుడే ఈ విషయం గురించి తెలుసుకున్నాను. ఇలాంటి వ్యక్తులు మన మధ్య పనిచేస్తునందుకు చాలా అవమానకరంగా ఉంది' అంటూ ఒక్క మాటలో తన కోపాన్ని, వ్యతిరేకతను తీవ్ర స్థాయిలో వెల్లడించారు.

    కేవలం రానా మాత్రమే కాక...ఒక్కసారిగా ఇప్పుడు తమన్నా, నయనతార లాంటి హీరోయిన్లు అందరూ ఈ దర్శకుడిపై విరుచుకు పడ్డారు. 'అమ్మాయిలంటే, అంత అలుసా?' అని విశాల్‌ సహా హీరోలూ గొంతు కలిపారు. చినికి చినికి గాలివానగా మారిన ఈ కాంట్రవర్సీ విషయంలో...ఇంతకీ ఏం జరిగింది అంటే...

    కోట్లలో తీసుకునేటప్పుడు

    కోట్లలో తీసుకునేటప్పుడు

    ఇంట‌ర్ వ్యూలో తమన్నా షార్ట్ డ్రెస్సెస్ & స్కిన్ షో పై సూర‌జ్ ని అడిగితే...హీరోయిన్స్ కోట్ల‌లో రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నారు. మాస్ ఆడియోన్స్ హీరోయిన్స్ గ్లామ‌ర్ కోసం థియేట‌ర్స్ కి వ‌స్తుంటారు. అందుచేత హీరోయిన్స్ స్కిన్ షో చేసి తీరాలి.

    సీరియల్ చేసుకోవచ్చు

    సీరియల్ చేసుకోవచ్చు

    నేనైతే హీరోయిన్స్ కాస్ట్యూమ్ డిజైన‌ర్ మోకాలి కింది వ‌ర‌కు డ్రెస్ తీసుకు వ‌స్తే క‌ట్ చేయ‌మ‌ని చెబుతాను. ఏక్టింగ్ స్కిల్స్ చూపించాలి అంటే సీరియ‌ల్స్ లో చూపించ‌వ‌చ్చు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో అయితే స్కిన్ షో చేయాల్సిందే అన్నారు.

    షార్ట్ డ్రెస్ లుకావాల్సిందే

    షార్ట్ డ్రెస్ లుకావాల్సిందే

    ''హీరోయిన్స్ ని తీసుకునేదే ఎక్స్ పోజింగ్ కోసం.. అమ్మాయిల్ని ఎంత పొట్టి బట్టల్లో చూపిస్తే మాస్ ఆడియెన్స్ అంత థ్రిల్ అవుతారు.. కాస్ట్యూమ్ డిజైనర్స్ తో నేను కావాలనే షార్ట్ డ్రెస్ లు డిజైన్ చేయిస్తా.. కమర్షియల్ మూవీస్ లో చేయాలంటే ఎక్స్ పోజింగ్ తప్పనిసరి'' అంటూ హీరోయిన్స్ గురించి చీప్ గా మాట్లాడేశాడు.
    సూరజ్

    మిల్కీ బ్యూటీ స్పందన

    మిల్కీ బ్యూటీ స్పందన

    ఈ సినిమా దర్శకుడు సూరజ్ పై హీరోయిన్లు అందరూ ఫైర్ అవుతున్నారు. ఆల్రెడీ హీరోయిన్ నయనతార కూడా ఈ విషయంలో సూరజ్ సారీ చెప్పాలని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇప్పుడు మిల్కీ కూడా స్పందించింది.

    నయన్ ఇలా ఫైర్కామెంట్స్ పై న‌య‌న‌తార మొదట ఫైర్

    నయన్ ఇలా ఫైర్కామెంట్స్ పై న‌య‌న‌తార మొదట ఫైర్

    అయ్యారు. నేను ఇప్ప‌టి వ‌ర‌కు పాత్ర‌కు తగ్గ‌ట్టే స్కిన్ షో చేసాను. ఆడియోన్స్ కు సూర‌జ్ కంటే మంచి టేస్ట్ ఉంది. హీరోయిన్స్ గ్లామ‌ర్ కోసం థియేట‌ర్స్ కి రావడం లేదు అంటూ త‌న అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేసింది.

    లెఫ్ట్ అండ్ రైట్

    లెఫ్ట్ అండ్ రైట్

    ఎప్పటిలాగే సూరజ్ కామెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా కొందరు ఖండించారు. కానీ మీడియాకి దూరముండే నయనతార మాత్రం సూరజ్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తూ ఫైర్ అయ్యింది.

    నిజ స్వరూపం

    నిజ స్వరూపం

    ఓ వైపు పింక్.. దంగల్ అంటూ సినిమాలు తీస్తూ ఉమెన్ ఎమ్ పవర్మెంట్ గురించి మాట్లాడతారు. మరోవైపు ఇలా నిజ స్వరూపం బయటపెట్టుకుంటారంటూ నయనతార సీరియస్ అయ్యింది .

    ఇలా మాట్లాడమేంటి

    ఇలా మాట్లాడమేంటి

    అసలు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అదీ ఓ డైరెక్టర్ ఇలా మాట్లాడమేంటి అని ఆగ్రహం వ్యక్తం చేసిన నయన్.. స్ర్కిప్ట్ డిమాండ్ చేస్తేనే హీరోయిన్స్ షార్ట్ డ్రెస్ లు వేసుకుంటారే తప్ప డబ్బుకి ఆశపడి కాదంటూ తేల్చి చెప్పింది.

    ఊరుకోం

    ఊరుకోం

    ''మేము అందరం స్ర్టిప్పర్స్ అనుకున్నారా? వెండితెర మీద బట్టలు చిన్నగా వేసుకుని అలరించడానికి మేం కీలుబొమ్మలం కాదు. ఇలా అమ్మాయిలను ఆబ్జెక్టిఫై చేయడం మానుకోండి'' అనేసింది నయన్. ఇంకోసారి హీరోయిన్స్ గురించి చీప్ గా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చిన నయన్ బోల్డ్ అటిట్యూడ్ కి ఇండస్ట్రీకి మొత్తం హ్యాట్సాఫ్ చెబుతోందిప్పుడు.

     క్షమాపణ చెప్పాల్సిందే

    క్షమాపణ చెప్పాల్సిందే

    కాస్త లేటైనా కూడా.. అక్కడ హీరోయిన్ గా చేసింది తనే అయినా కూడా.. తమన్నా బాగానే స్పందించింది. ''దంగల్ సినిమా చూస్తూ దియేటర్లో నుండి ఈ కామెంట్లు గురించి తెలుసుకుని బయటకు వచ్చేశాను. సూరజ్ మాటలు బాధను కలిగించాయి. కోపం తెప్పించాయి. నాకే కాదు.. మొత్తంగా సినిమాల్లో ఉన్న అమ్మాయిలందరికీ కలిపి సూరజ్ క్షమాపణలు తెలపాల్సిందే అంది తమన్నా.

    ఊరుకునేది లేదు

    ఊరుకునేది లేదు

    ఇక్కడకు నటించడానికి వచ్చాం తప్పితే.. వేరే వాటికి కాదు. ఆటవస్తువులుగా చిత్రీకరిస్తే ఊరుకునేదే లేదు. ఈ 11 సంవత్సరాల కెరియర్లో నాకు నచ్చిన బట్టలను.. నాకు నప్పే బట్టలనే వేసుకున్నాను. అలాగే సూరజ్ మాటలను తీసుకుని ఇండస్ర్టీ అంతా అలాగే ఉంటుందని అనుకోవద్దు'' అంటూ తమన్నా స్టేట్మెంట్ ఇచ్చింది.

    ఈ రోజుల్లోనూ...

    ఈ రోజుల్లోనూ...

    మ‌నం 2016లో ఉన్నాం. పింక్, దంగ‌ల్ త‌ర‌హా సినిమాలు వ‌స్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో సూర‌జ్ ఇలా మాట్లాడ‌డం చాలా బాదాక‌రం. సూర‌జ్ ఖ‌చ్చితంగా క్ష‌మ‌ప‌ణ‌లు చెప్పాల్సిందే. మేము ఆడియోన్స్ ను ఎంట‌ర్ టైన్ చేయాలి అనుకుంటాం. మ‌మ్మ‌ల్ని వ‌స్తువుల్లా చూడ‌కండి అంటూ సూరజ్ పై ఫైర్ అయ్యింది మిల్కీబ్యూటీ..!

    హీరో విశాల్‌ ఏమంటాడంటే...

    హీరో విశాల్‌ ఏమంటాడంటే...

    'ఒక్కడొచ్చాడు'లో హీరోగా నటించిన విశాల్‌ ఈ వివాదం గురించి సోమవారం సాయంత్రం స్పందించారు. దర్శకుడు సురాజ్‌ క్షమాపణ చెప్పడం ఆనందం అన్నారు. ''ఇలా జరిగినందుకు సారీ'' అని తమన్నాను ఉద్దేశించి హీరో విశాల్‌ పేర్కొనడం విశేషం.

    శరీరాన్ని ప్రదర్శించటం లేదు

    శరీరాన్ని ప్రదర్శించటం లేదు

    ఇంకా విశాల్‌ మాట్లాడుతూ - ''సురాజ్‌ అనవసరమైన వ్యాఖ్యలు చేశాడు. 'నడిగర సంగం' జనరల్‌ సెక్రటరీగా కాదు, ఓ నటుడిగా ఈ మాట అంటున్నా. కథానాయికలు తమ నట ప్రతిభను కనబరుస్తున్నారు తప్ప శరీరాన్ని ప్రదర్శించడం లేదు'' అన్నారు.

    సారీ చెప్తూ..

    సారీ చెప్తూ..

    రెమ్యూనరేషన్ కోసమే గ్లామర్ పాత్రలంటూ హీరోయిన్లపై నోరు పారేసుకున్న 'ఒక్కడొచ్చాడు' దర్శకుడు సురాజ్‌ టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నాకు క్షమాపణలు చెప్పాడు. తమన్నాతోపాటు, సిరీ పరిశ్రమలో్ని మిగిలిన హీరోయిన్లందరిపై చేసిన సెక్సిస్ట్ కామెంట్లకు సారీ చెబుతూ ఒక ప్రకటన జారీ చేశారు.

    హీరోయిన్స్ అందరికీ

    హీరోయిన్స్ అందరికీ

    సోమవారం మీడియాకు విడుదల ఒక ప్రకటనలో తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. తన ఉద్దేశం అదికాదని, వారిని నొప్పించి ఉంటే క్షమించాలంటూ తమన్నా సహా అందరి హీరోయిన్స్ అందరికు సారీ చెప్పాడు.

    సంతృప్తి పరచటానికే...

    సంతృప్తి పరచటానికే...

    బి, సి సెంటర్లను 'సంతృప్తి' పరచడానికే పొట్టి బట్టలు ధరిస్తారని సూరజ్ అనటమే వివాదానికి కారణమైంది . ఈ ఇంటర్వ్యూ కు సంబంధించిన వీడియో పై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో దిగివచ్చిన దర్శకుడు చివరికిలా క్షమాపణలు తెలిపాడు.

    తీవ్ర ఆగ్రహం

    తీవ్ర ఆగ్రహం

    హీరోయిన్లపై వివక్షపూరితమైన, లైంగికపరమైన వ్యాఖ్యలు చేసిన తమిళ దర్శకుడు సూరజ్‌పై సినీ పరిశ్రమకు సంభందం లేని వాళ్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్లు గ్లామరస్‌ రోల్స్‌ చేయకతప్పదని, అందుకే వారికి రెమ్యూనరేషన్‌ ఇస్తున్నామని పేర్కొనటం పద్దతి కాదంటున్నారు.

    తీవ్ర స్దాయిలో

    తీవ్ర స్దాయిలో

    'చిత్ర పరిశ్రమకు చెందిన ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఇలాంటి చీప్‌, అసభ్య వ్యాఖ్యలు ఎలా చేస్తారు? హీరోయిన్లను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసేందుకు సూరజ్‌ ఎవరు? హీరోయిన్లు స్ట్రిప్పర్లు అని, డబ్బులు ఇవ్వగానే వచ్చి దుస్తులు విప్పేసి నటిస్తారని ఆయన అనుకుంటున్నారా? తన ఇంట్లోని ఉద్యోగం చేసే మహిళల గురించి అలా మాట్లాడే దమ్ము ఆయనకు ఉందా?' అంటూ నయన తీవ్రస్థాయిలో మండిపడింది.

    మిగతా డైరక్టర్స్ సైతం..

    మిగతా డైరక్టర్స్ సైతం..

    ''లోయర్‌ క్లాస్‌ ఆడియన్స్‌ని హీరోయిన్స్ చిట్టి పొట్టి బట్టలు వేసుకుని, ఆనందపరచాలి. ఒకవేళ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కనక కథానాయికలు వేసుకోవాల్సిన డ్రెస్సులను మోకాళ్లు కవర్‌ చేసేలా డిజైన్‌ చేస్తే... 'లెంగ్త్‌ తగ్గించండి' అని నిర్మొహమాటంగా చెబుతా అనటంతో మిగతా కమర్షియల్ డైరక్టర్స్ సైతం ఆయన్ని విమర్శిస్తున్నారు.

     చర్చనీయాంశం..

    చర్చనీయాంశం..

    హీరోయిన్‌కి అసౌకర్యంగా అనిపించినా నాకు సంబంధం లేదు. ఆ డ్రెస్‌ వేసుకోవాల్సిందేనని చెప్పేస్తా'' అని కూడా సురాజ్‌ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, మరో అడుగు ముందుకేసి, 'ప్రేక్షకులు అసలు థియేటర్‌కి వచ్చేదే కథానాయికలను 'అలా' చూడ్డానికే' అని స్పష్టంగా చెప్పారు. ''ప్రేక్షకులు డబ్బులు పెట్టి టికెట్‌ కొనేది హీరోయిన్లను అలాంటి దుస్తుల్లో చూడ్డానికే'' అని సురాజ్‌ అనడం టీవి మీడియాలోనూ చర్చనీయాంశమైంది.

    నాలుగు గోడల మధ్యే

    నాలుగు గోడల మధ్యే

    జనరల్‌గా సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ గురించి ఎక్కువగా ఇలా మాట్లాడుతుంటారు. అందరూ కాకపోయినా ఎక్కువ మందికి మాత్రం హీరోయిన్ల పట్ల ఇలాంటి చులకన భావమే ఉంటుంది. అయితే ఏం మాట్లాడినా నాలుగు గోడల మధ్య మాట్లాడేస్తారు కాబట్టి, అవి వెలుగులోకి రావు. కానీ ఇలా బహిరంగంగా మాట్లాడితే, హీరోయిన్స్ మనోభావాలను దెబ్బ తీసినట్లే అని విమర్శకులు అంటున్నారు.

    వేశ్యలతో పోల్చి

    వేశ్యలతో పోల్చి

    ప్రముఖ తమిళ దర్శకుడు తంగర్‌ బచ్చన్‌ అయితే గతంలో హీరోయిన్స్ ను వేశ్యలతో పోల్చి, పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. ఆ సమయంలో సీనియర్‌ నటి ఖుష్బూ సదరు దర్శకుడిపై విరుచుకుపడ్డారు. క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టి మరీ, చివరకు విజయం సాధించారు.

    అందరి సపోర్ట్

    అందరి సపోర్ట్

    ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు, ఆ దర్శకుడి సినిమాలో నటించిన హీరోయిన్ ఒక్కరూ స్పందిస్తే.. సరిపోతుందా? వాస్తవానికి 'కమర్షియల్‌ సినిమా'ల్లో నటించే ప్రతి హీరోయిన్ కూ సురాజ్‌ మాటలు వర్తిస్తాయి. అందుకే ఒక గొంతుకి ఇంకో గొంతు తోడైతే విషయం బలపడుతుంది అని మిగతా హీరోయిన్స్ అంటున్నారు.

    ట్వీట్స్...రీ ట్వీట్స్

    ట్వీట్స్...రీ ట్వీట్స్

    శ్రుతీహాసన్, తదితర హీరోయిన్లు పలువురు కూడా వీరి మాటలకు సంఘీభావం ప్రకటిస్తూ, ట్విట్టర్‌లో ట్వీట్‌లు, రీ-ట్వీట్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాది చిత్ర సీమలో సురాజ్‌ మాటలు, అతనిపై విమర్శలే... పెద్ద హాట్‌ టాపిక్‌. చివరకు సురాజ్‌ వెనక్కి తగ్గి, క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. అవును మరి... స్త్రీలను గౌరవించక పోగా, నోటికొచ్చినట్లు మాట్లాడితే తిప్పలు తప్పవని సురాజ్‌ లాంటి వాళ్ళకు తెలియాల్సిందే అంటున్నారు.

    ఎవరితను

    ఎవరితను

    నయనతార అయితే ''అసలు హీరోయిన్స్ పై ఇంత నీచమైన, అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేసిన ఈ సురాజ్‌ ఎవరు? కథానాయికలకు డబ్బులు ఇస్తున్నారు కనుక... కెమేరా ముందుకొచ్చిన తర్వాత బట్టలు విప్పేస్తారని అతడు అనుకుంటున్నాడా? అతడి కుటుంబంలో పనిచేస్తున్న మహిళలపై ఈ కామెంట్‌ చేసే దమ్ముందా?'' అని హీరోయిన్ నయనతార, సురాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అతడు ఏ కాలంలో ఉన్నాడంటూ ప్రశ్నించారు.

    కథకు అణుగుణంగానే..

    కథకు అణుగుణంగానే..

    ''ఈ సంవత్సరం వచ్చిన 'పింక్‌', 'దంగల్‌' వంటి సినిమాలు మహిళల సాధికారత, గౌరవం గురించి మాట్లాడుతుంటే... సురాజ్‌ ఎక్కడ ఉన్నాడో? కమర్షియల్‌ సినిమాల్లో కథానుగుణంగానో, తమకు సౌకర్యవంతంగా అనిపిస్తేనో హీరోయిన్స్ గ్లామరస్‌గా కనిపించే దుస్తులను ధరిస్తారు.

    యూత్ ని తప్పుదారి

    యూత్ ని తప్పుదారి

    అయినా... సురాజ్‌ ఏ ప్రేక్షకుల గురించి మాట్లాడుతున్నాడో? హీరోయిన్స్ చిట్టిపొట్టి బట్టల్లో చూడడానికి ప్రేక్షకులు టికెట్లు కొని సినిమాలకు వస్తున్నారా! లేదు. సురాజ్‌ కన్నా ప్రేక్షకులే సినీ తారలను ఎక్కువ గౌరవిస్తున్నారు. 'ఎక్కువ డబ్బులు తీసుకుని హీరోయినస్ చిట్టిపొట్టి బట్టలు వేసుకుంటున్నారు' అనడం ద్వారా అతడు యువతరాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అంటూ నయనతార అంది.

    లోక్లాస్ వాళ్ల కోసం..

    లోక్లాస్ వాళ్ల కోసం..

    నేనూ కమర్షియల్‌ సినిమాల్లో గ్లామరస్‌గా నటించాను. అయితే, 'లో క్లాస్‌' ప్రేక్షకుల కోసం అలా నటించమని నా దర్శకులు బతిమాలారనో, ఎక్కువ డబ్బులు ఇచ్చారనో గ్లామరస్‌గా నటించలేదు. నేను అలాంటి సినిమాలు ఎంపిక చేసుకున్నాను. కథానాయికలను అలుసుగా తీసుకునే హక్కు ఎవరికీ లేదు'' అని ఘాటుగా స్పందించారు నయనతార.

    బాధించాయి..కోపం తెప్పించాయి

    బాధించాయి..కోపం తెప్పించాయి

    ''తప్పు... నా దర్శకుడు (సురాజ్‌) చేసిన కామెంట్స్‌ నన్ను బాధించాయి. కోపమూ తెప్పించాయి. తప్పకుండా అతను క్షమాపణలు చెప్పి తీరాల్సిందే. నాకు మాత్రమే క్షమాపణ చెబితే చాలదు. చిత్ర పరిశ్రమలో మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలి'' అని తమన్నా సోషల్‌ మీడియా వేదికగా దర్శకుడు సురాజ్‌ని నిలదీశారు.

    ఇన్నేళ్లుగా నటిస్తున్నా

    ఇన్నేళ్లుగా నటిస్తున్నా

    తమన్నా మీడియాతో మాట్లాడుతూ -''నటీనటులుగా ప్రేక్షకులను అలరించడం మా బాధ్యత. అంతేగానీ... మమ్మల్ని వస్తువులుగా వర్ణించడం ఏ మాత్రం బాగోలేదు. నేను దక్షిణాది చిత్రాల్లో 11 ఏళ్లుగా నటిస్తున్నా. ఇన్నేళ్లుగా నాకు సౌకర్యవంతంగా అనిపించిన దుస్తులే వేసుకున్నా. మన దేశంలో మహిళల గురించి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ప్రేక్షకులకు నేను చెప్పేదొక్కటే.... ఓ వ్యక్తి చేసిన కామెంట్స్‌ ఆధారంగా చిత్ర పరిశ్రమ అంతటినీ అదే దృష్టిలో చూడొద్దు'' అన్నారు తమన్నా.

    వెనక్కి తీసుకుంటున్నా

    వెనక్కి తీసుకుంటున్నా

    హీరోయిన్స్ గురించి తాను చేసిన వ్యాఖ్యలు వివాదం అవుతాయని మాట్లాడుతున్న సమయంలో బహుశా సురాజ్‌ ఊహించినట్లు లేరు. అనుకోని విధంగా తమన్నా, నయనతార సహా పలువురు హీరో,హీరయిన్స్ స్పందించడంతో... సురాజ్‌ దిమ్మెరపోయారు. దాంతో, సోమవారం సాయంత్రం ఆయన హీరోయిన్ల గురించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు.

     తప్పుగా మాట్లాడా...

    తప్పుగా మాట్లాడా...

    ''మిస్‌ తమన్నా సహా హీరోయిన్స్ అందరికీ నేను క్షమాపణ చెబుతున్నా. ఒకరి గురించి తప్పుగా మాట్లాడి, వాళ్ల మనసు బాధపెట్టాలనే ఆలోచన నాకు లేదు. నేను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నా. మరొక్కసారి క్షమాపణలు చెప్పుకుంటున్నా'' అని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

    నిజమే కదా..

    నిజమే కదా..

    అయితే తమన్నా కంటే ముందే ఈ వివాదం గురించి ఎప్పుడూ మీడియా ముందుకు రాని నయనతార స్పందించడం.. అలాగే ఈ కామెంట్లన్నీ ఎలా ఉన్నా కూడా అసలు తమన్నా తన సినిమాల్లో విపరీతమైన ఎక్సపోజింగ్ చేయడం దారుణం.. అంటూ ఇప్పుడు తమిళ మీడియా ఆమెను ఏకేస్తోంది. ఈ కామెంట్స్ సంగతేమో కాని.. ''ఒక్కడొచ్చాడు'' సినిమాకు మాత్రం ఇప్పుడు ఫ్రీ పబ్లిసిటీ అవుతోంది. కాదంటారా?

    English summary
    Director G Suraj's alleged sexist comments against Tamannah Bhatia drew the ire of the actor with co-star Vishal coming in support of her, prompting the filmmaker to issue an apology.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X