twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క కి ప్ర్తత్యేక పార్టీ ఇస్తున్న దర్శకుడు

    By Srikanya
    |

    చెన్నై: అనూష్క తాజాగా బృందావనంలో నందకుమారుడు అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అనూష్క,ఆర్య కాంబినేషన్ లో సెల్వ రాఘవన్ డైరక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా జార్జియాలో నలభై రోజులు పాటు కంటిన్యూ గా జరిగింది. ఆ షూటింగ్ లో అనూష్క డెడికేషన్ ని చూసి ముచ్చటపడిన దర్శకుడు ఆమెకు ప్రత్యేకంగా పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్టీ లక్ష్యం ఆమె డెడికేషన్ ని గౌరవించటమే అని చెప్తున్నారు.

    'అరుంధతి'చిత్రంతో తాను గ్లామర్ పాత్రలే కాదు నటనకు అవకాశమున్న పాత్రలను చేసి ఒప్పించగలనని ప్రూవ్ చేసుకున్న హీరోయిన్ అనూష్క. తాజాగా ఆమె 'ఇరండామ్ ఉలగమ్'లో ద్విపాత్రాభినయం చేస్తోంది. అందులో ఓ పాత్ర సాధారణ గృహిణి కాగా, రెండవది ఆటవిక యువతి పాత్ర. గృహిణిపాత్ర రెగ్యులర్ గా ఉన్నా అటవిక పాత్రలో ఆమె అద్బుతంగా చేస్తోందని తమిళ మీడియా అంటోంది.

    అనుష్క మాట్లాడుతూ- ''ఈ పాత్రను ఛాలెంజ్‌గా తీసుకొని చేస్తున్నాను.'అరుంధతి' తర్వాత నాకు అంతకన్నా గొప్ప పేరును తెచ్చిపెట్టే సినిమా ఇది. ఇందులో కొత్త అనుష్కను చూస్తారు. ద్విపాత్రాభినయం చేయడం నాకు కొత్తేం కాదు. అరుంధతి, పంచాక్షరి చిత్రాల్లో ఇప్పటికే ద్విపాత్రలు చేశాను. కానీ ఆ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఇందులోని నా పాత్రలు సాగుతాయి. ఇంత మంచి పాత్రలను ఇచ్చి ప్రోత్సహించిన సెల్వరాఘవన్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను'' అన్నారు.

    దర్శకుడు సెల్వ రాఘవన్ మాట్లాడుతూ.. ఆటవిక యువతిగా అనూష్క ఎన్నో రేర్ ఫీట్స్ చేయాల్సి వుంది. భయంకరమైన పోరాట సన్నివేశాల్లో కూడా పాల్గొనాల్సి ఉంది. ఆ పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. ఈ పాత్ర అనుష్క కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అన్నారు. ఈ పాత్ర కోసం అనుష్క గత కొన్నాళ్లుగా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇక ఈ 'ఇరండామ్ ఉలగమ్' సినిమాలో అనూష్క సరసన హీరో ఆర్య చేస్తున్నారు.

    అయితే ఈ చిత్రం గతంలో రానా తో తెలుగులో అనుకున్న కథే అని తెలుస్తోంది.అదే కథ కనుక అయితే ఆ చిత్రంలో హీరో ద్విపాత్రాభినయం చేస్తారు.అయిదువేల సంవత్సరాల క్రితం కథ అది. జానపదం ,చరిత్రాత్మకం కలిసి ఉంటుంది. పూర్తి వైవిధ్యమైన చిత్రం అవుతుంది. అయితే ఆర్యకు తెలుగులో ఎంత వరకూ మార్కెట్ ఉన్నది అనే దానిపై ఈ చిత్రం విజయం ఆధారపడి ఉంటుంది.

    English summary
    Anushka returned from Georgia shooting 40-days non-stop for PVP Cinema produced Selvaraghavan's Brindavanamlo Nandakumarudu (Irandaam Ulagam in Tamil). The film's director was so thrilled with her dedication and hardworking nature without showing any tantrum despite lack of good facilities in remote locations of Georgia. So content with her commitment, he reportedly threw a party specially for her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X