For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లేడీ సింగర్ ని ఎవాయిడ్ చేస్తున్న దర్శకులు, మ్యూజిక్ డైరక్టర్స్

  By Srikanya
  |

  చెన్నై: ప్రముఖ సింగర్,మరియు డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి కి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. ఆమెను దర్శకులు, సంగీత దర్శకులు ఎవాయిడ్ చేస్తున్నారు. దీనికి కారణం ఆమె ఫైర్ బ్రాండ్ లా మారటమే అంటున్నారు. ఆ మధ్య ఆమె తనకు డబ్బు ఎగ్గొట్టారంటూ విదేశాల్లో సంగీత కార్యక్రమాలు నిర్వహించే గజేంద్రకుమార్ పై కంప్లైంట్ చేసింది. అతను తనకు రూ. 12 లక్షలు బాకీ ఉన్నారని , డబ్బు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీస్ కంప్లైట్ చేసారు. ఆ డబ్బు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

  దాంతో కొందరు సిని పరిశ్రమలో డబ్బు లావాదేవీలు జరిగేటప్పుడు ఒక్కోసారి ఊహించని పరిణామాలు ఎదురవుతాయని, ఆమె పరిశ్రమ పెద్దలతో సెటిల్ చేసుకోకుండా,పోలీసులను ఆశ్రయించటం పద్దతి కాదని, భవిష్యత్ లోనూ తమపైనా అలాగే కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటుందని గ్యారెంటీ ఏమిటని అంటున్నారు. మరో ప్రక్క తన ఫొటోను అసభ్యంగా చిత్రీకరించి ఇంటర్నెట్‌లో పెట్టారంటూ ప్రముఖ సినీ నేపథ్య గాయని చిన్మయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏమి మాయ చేసావే చిత్రంలో సమంతకు డబ్బింగ్ చెప్పి,కంటిన్యూగా ఆమెకు డబ్బింగ్ చెప్తున్న ఆమె సింగర్ కూడా పాపులర్. తమిళనాడులోనూ కన్నత్తిల్ ముత్తమిట్టాల్ తమిళ చిత్రంలో ఒరు దైవం తందపూవే పాట ద్వారా సినీ గాయనిగా చిన్మయి పరిచయమయ్యారు. ఆమె తల్లి పద్మాసినితో ఆమె పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చి రెండు ఫిర్యాదులు సమర్పించారు.

  ఈ నేపధ్యంలో చిన్మయి వంటి ఫైర్ బ్రాండ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలని, అలా అంత భయపడుతూ ఆమెతో పనిచేసే కన్నా...ఎవాయిడ్ చేయటం బెస్ట్ అని దూరం పెడుతున్నారని చెన్నై సమాచారం. నిజానికి చిన్మయి తప్పు లేకపోయినా,ఆమె తన డబ్బుకోసం, తన అభిమానం కోసం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇలా చేయటం మాత్రం పద్దతి కాదనేది నిజం. మరో ప్రక్క చిన్మయితో డబ్బింగ్ చెప్పించుకునే సమంత తను స్వయంగా డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకోవటం కూడా కెరీర్ పరంగా ఇబ్బందే.

  సన్‌ టీవిలో వచ్చే 'సప్తస్వరాంగల్‌' అనే సంగీత కార్యక్రమంలో పాల్గొని మంచి పేరు సంపాదించింది చిన్మయి. గాయకుడు శ్రీనివాస్‌ ఆమెను ఏ.ఆర్‌.రెహ్మాన్‌తో పరిచయం చేయించాడు. రెహ్మాన్‌ కంపోజింగ్‌లో వచ్చిన 'కన్నాతిల్‌ ముత మిట్టల్‌' లో 'ఒరు దేవమ్‌ తాంట పూవే' అనే పాటతో కెరీర్‌ను ప్రారంభించారు చిన్మయి. కొంత కాలంలోనే ఆమె తెలుగు, తమిళం, తులు, మళయాలం భాషలలో అనేక చిత్రాలకు గాత్రానందించారు. మంగళ్‌పాండే చిత్రంలో పాడటంతో ఆమె బాలీవుడ్‌లో కూడా తన కెరీర్‌ ప్రారంభించారు. ఒక సంవత్సరం తరువాత ఆమె 'గురు' చిత్రంలో 'తెరె బిన, మాయ్య' అనే పాటలకు మరింత గుర్తింపు వచ్చింది. ఆమె పాడిన పాటలలో సహానా, వారాయో, అన్‌బిల్‌ అవన్‌, కిలిమంజారో వంటి పాటలతో పాపులారిటీని సంపాదించింది. తెలుగులో ఆమె... ఏ దేవి వారము నీవో - అమృత (2002), కిన్గిని మింగిని- అల్లరి (2002), మేఘం కరిగెను - నాగ (2003) పాటలుతో బాగా పరిచయం.

  English summary
  Now, directors, producers and Music directors are avoiding Chinmayi due to her Fire Brand character.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X