»   » డిస్కోశాంతికి మరో కష్టం.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం..

డిస్కోశాంతికి మరో కష్టం.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటుడు శ్రీహరి మరణం నుంచి ఇంకా బయటపడని డిస్కోశాంతికి మరో కష్టం ఎదురైంది. తన మేన కోడలు అబ్రినా (17) కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందుతున్నారు. అబ్రినా ఆచూకీ కోసం వెతుకుతున్నారు. అబ్రినా ఆచూకీ కోసం కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. చెన్నైలోని ఓ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సెప్టెంబర్ 6న స్కూల్ కు వెళ్లిన

సెప్టెంబర్ 6న స్కూల్ కు వెళ్లిన

అబ్రినా డిస్కో శాంతి అన్న కుమార్తె. నటుడు ప్రకాశ్ రాజ్ మొదటి భార్య లలితా కుమారికి అబ్రినా మేనకోడలు కూడా అవుతుంది. అబ్రినా చెన్నైలోని చర్చ్ పార్క్ స్కూల్ లో చదువుతున్నది. సెప్టెంబర్ 6న స్కూల్ కు వెళ్లిన బాలిక కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి అబ్రినా కోసం వెతుకుతున్నారు.

చెన్నైలోని పాండీ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

చెన్నైలోని పాండీ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

అబ్రినా తప్పిపోయిన రోజే చెన్నైలోని పాండీ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అబ్రినా కనిపించకుండా పోయి చాలా రోజులు అవుతున్న ఆచూకీ దొరకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.

అబ్రినా ఆచూకీ కోసం

అబ్రినా ఆచూకీ కోసం

అబ్రినా ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల లలిత కుమారి, అబ్రినా తల్లి షెరిల్ మీడియా సమావేశం నిర్వహించారు. అబ్రినా ఆచూకీ దొరికితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

56 సీసీటీవీ ఫుటేజీలను

56 సీసీటీవీ ఫుటేజీలను

స్కూల్‌లోని 56 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయినా ఎలాంటి సమాచాం లభ్యం కాకపోవడంతో అబ్రినా కనిపించకుండా పోవడంపై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అబ్రినా గురించి తలచుకొంటూ ఆమె తల్లి షెరిల్ కన్నీరు మున్నీరయ్యారు.

కిడ్నాప్ చేశారా లేదా?

కిడ్నాప్ చేశారా లేదా?

అబ్రినాను కిడ్నాప్ చేశారా లేదా ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అవకాశం ఉన్న మేరకు ఆధారాలు సేకరిస్తున్నారు. అబ్రినా స్నేహితులను, ఇతర విద్యార్థులను విచారిస్తున్నారు.

English summary
The niece of popular South actresses, Disco Shanthi and Lalitha Kumari, Abrina, has been missing for five days, IndiaGlitz reports. The 17-year-old girl, who is the daughter of Disco Shanthi and Lalitha Kumari's brother, went missing on September 6 while returning from school.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu