twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మణిరత్నం ముంచేసాడని పోలీస్ కంప్లైంట్

    By Srikanya
    |

    చెన్నై: మణిరత్నం టైమ్ బాగున్నట్లు లేదు. అసలే తను తీసిన కడల్‌ (తెలుగులో కడలి) భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయిందని విచారంలో ఉంటే,దానికి సంభందించిన వివాదాలు ఇంకా వీడటం లేదు. రీసెంట్ గా బుధవారం మణిరత్నంపై చెన్నై నగర పోలీసు కమీషనర్‌కి మన్నన్‌ అనే పంపిణీదారుడు ఫిర్యాదు చేశారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం కడల్‌ (తెలుగులో కడలి) ఈ నెల 1న విడుదలైంది. ఆ చిత్రం పంపిణీ మూలంగా భారీగా నష్టపోయామని మణి ఇంటి ఎదుట పంపిణీదారులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.

    ఆ పిర్యాదులో ... ''రూ.16 కోట్లు వెచ్చించి కొంటే రూ.3.2 కోట్లు మాత్రమే వచ్చింది. కడల్‌ చిత్రాన్ని పంపిణీకి ముందు ఓసారి చూపించమని కోరితే సాంకేతిక కారణాల వల్ల కుదరదని మణిరత్నం మేనేజర్‌ తెలిపారు. దర్శకుడిపై నమ్మకంతో కొన్నాను. నష్టం గురించి ఆయనతో చర్చించాలని పలుమార్లు ప్రయత్నించాను. భేటీ కుదరలేదు. నష్టపోయిన మొత్తాన్ని ఇప్పించాలి''అని ఆ ఫిర్యాదులో మన్నన్‌ పేర్కొన్నారు.

    మరో ప్రక్క దర్శకుడు మణిరత్నం ఇంటికి పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మణిరత్నం మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన కేసులో కడలి సినిమా ప్రస్తుతం రాష్ట్రంలోని పలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నాడు. ఈ సినిమా పంపిణీ చేయడంలో డిస్ట్రిబ్యూటర్లకు నష్టం ఏర్పడిందని కొందరు బెదిరిస్తున్నారని తెలిపాడు. దీనివలన తన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందన్నారు.

    తనకు పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలని అందులో పేర్కొన్నారు. ఈ కేసుపై న్యాయమూర్తి రాజేశ్వరన్ విచారణ జరిపారు. పిటిషన్‌దారుడి తరఫున న్యాయవాది కుమార్ రాజారత్నం హాజరయ్యారు. మణిరత్నం ఇంటికి, ఆయన కార్యాలయానికి వెంటనే పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి మార్చి 14వ తేదీ వరకు మణిరత్నం ఇంటికి, కార్యాలయానికి భద్రత కల్పించాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

    English summary
    Kadal was a big loss to its distributor Mannan films. Now the latest is that Mannan films filed a complaint against Mani Ratnam today because they have suffered a 16crore loss by releasing Kadal. Mean time it is said that Mani Ratnam is in Kodaikanal and they have already issued a press release stated that “Madras Talkies was not responsible for the Kadal losses as they have already sold it to GFC”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X