»   » ఆత్మహత్య బెదిరింపు..... ‘కాలా’ రిలీజ్ వేళ రజనీకి కొత్త తలనొప్పి!

ఆత్మహత్య బెదిరింపు..... ‘కాలా’ రిలీజ్ వేళ రజనీకి కొత్త తలనొప్పి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్ నటించిన సినిమాలు సరిగా ఆడక డిస్ట్రిబ్రూటర్లు నష్టపోతే.... వారు తిరిగి డబ్బులు డిమాండ్ చేయడం కొత్తేమీ కాదు. 'బాబా' సినిమా నుండి 'లింగా' వరకు ఇలాంటివి చాలా చూశాం. పలు సందర్భాల్లో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను రజనీకాంత్ తన సొంత డబ్బుతో ఆదుకున్నారు. తాజాగా రజనీకాంత్ గత చిత్రం 'కబాలి'తో నష్టపోయిన ఓ డిస్ట్రిబ్యూటర్ 'కాలా' విడుదల వేళ వివాదం మొదలు పెట్టాడు. తన నష్టాలు పూడ్చకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

వీరయ్య బిడ్డనిరా ఒక్కడినే ఉన్నా..దిల్లు ఉంటే గుంపుగా రండ్రా.. రజిని 'కాలా' టీజర్ అరుపులే!
 సెల్వ కుమార్

సెల్వ కుమార్

సెల్వ కుమార్ అనే డిస్ట్రిబ్యూటర్ రజనీకాంత్ ‘కబాలి' చిత్రం రైట్స్ సౌత్ ఆర్కాట్, పాండిచ్చేరి ప్రాంతాలకుగాను రూ. 5.5 కోట్లకు కొనుగోలు చేశాడు. అయితే అక్కడ సినిమా సరిగా ఆడక పోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. తనను ఆదుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

రజనీకాంత్‌ను లాగలేదు కానీ.....

రజనీకాంత్‌ను లాగలేదు కానీ.....

నిర్మాత కలైపులి ఎస్ థాను తనను ఆదుకోవాలని సెల్వకుమార్ డిమాండ్ చేస్తున్నాడు. అయితే ఈ వివాదంలోకి రజనీకాంత్‌ను లాగక పోయినా..... ‘కాలా' సినిమా విడుదల వేళ ఆయనకు ఇది తలనొప్పే అనే టాక్ వినిపిస్తోంది.

 20 నెలలుగా ఆర్థిక కష్టాల్లో

20 నెలలుగా ఆర్థిక కష్టాల్లో

గత 20 నెలలుగా తాను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. అప్పలు తీసుకొచ్చి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాను. కానీ కబాలి సినిమా సరిగా ఆడక పోవడంతో డబ్బు తిరిగి రాలేదు. పరిహారం చెల్లించాలని థాను సార్‌ను వేడుకుంటున్నాను అని సెల్వ కుమార్ తెలిపారు.

 ఆత్మహత్య తప్ప మరో దారి లేదు

ఆత్మహత్య తప్ప మరో దారి లేదు

ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడటానికి ఇప్పటికే నా భార్య నగలు కూడా అమ్మాను. అయినా సరిపోలేదు. అప్పులు ఇచ్చిన వారు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. నన్ను ఎవరైనా ఆర్థికంగా ఆదుకోకపోతే చావు తప్ప మరో దారిలేదు అని సెల్వకుమార్ తెలిపారు.

 2.73 కోట్ల నష్టం

2.73 కోట్ల నష్టం

సెల్వకుమార్ ‘కబాలి' సినిమాను 5.5 కోట్లకు కొనుగోలు చేయగా.... లైఫ్ టైమ్ రన్‌లో రూ. 2.77 కోట్లు మాత్రమే వసూలైంది. ఇంకా రూ. 2.73 కోట్ల వసూలు కాలేదు. కలైపులి థాను అతడికి రూ. 1.5 కోట్లు తిరిగి ఇస్తానని హామీ కూడా ఇచ్చాడట. నిర్మాత ఎంత త్వరగా డబ్బు ఇస్తే తాను మిగతా అమౌంట్ అరేంజ్ చేసుకుని అప్పులు తీరుస్తానని సెల్వకుమార్ కోరుతున్నాడు.

 కాలా రిలీజ్ డేట్

కాలా రిలీజ్ డేట్

‘కాలా' చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెల్వకుమార్ వివాదం పెద్దగా అయితే రజనీకాంత్‌కు కొత్త తలనొప్పి తప్పదు అనే వాదన వినిపిస్తోంది. మరి ఈ విషయంలో రజనీకాంత్ కలుగ జేసుకుంటారా? లేక కలైపులి థాను అతడికి డబ్బు సెటిల్మెంట్ చేస్తాడా? అనేది వేయి చూడాలి.

English summary
A distributor has come out in open claiming he will end his life because he suffered huge losses from Rajinikanth's previous film Kabali. Surprisingly, he has not dragged the superstar into the issue, but rather addressed producer Kalaipulli S Thanu!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu