Just In
- 11 min ago
బ్లాక్‌లో పెట్టింది అన్ ఫాలో చేసింది.. అషూ రెడ్డిపై రాహుల్ కామెంట్స్
- 1 hr ago
షూటింగ్‌కు సిద్ధమైన మహేశ్ డైరెక్టర్: ఆ తరహా కథతో ప్రయోగం చేయబోతున్నాడు
- 1 hr ago
ఆ డబ్బులేవో నువ్వే ఇవ్వొచ్చు కదా?.. యాంకర్ సుమ పోస్ట్‌పై నెటిజన్ల కామెంట్స్
- 1 hr ago
గ్యాప్ తర్వాత అదరగొట్టేసిన అమలా పాల్: ఆమెను అలా చూసి ఆశ్చర్యపోవడం ఖాయమట
Don't Miss!
- Sports
క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒకే బంతికి ఒకే బ్యాట్స్‌మన్ రెండు సార్లు రనౌట్! వీడియో
- News
ఎన్నికల వేళ కేంద్రం మరో తాయిలం -బోడో రీజియన్‌కు రూ.500 కోట్లు -అస్సాంలో అమిత్ షా ప్రకటన
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టార్గెట్ రజనీకాంత్, కుట్రలో భాగమేనంటూ...!(ఫోటోస్)
హైదరాబాద్: ‘లింగా' చిత్రానికి సంబంధించి రజనీకాంత్ చుట్టూ వివాదం ముదురుతోంది. ‘లింగా' చిత్రం ద్వారా తాము భారీగా నష్టం పోయాం...ఆయన స్వయంగా జోక్యం చేసుకుని నిర్మాతలతో మాట్లాడి తమకు డబ్బులు ఇప్పించాలని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నిరాహార దీక్షకు కూడా మొదలు పెట్టారు.
అయితే అభిమానుల వాదన మరోలా ఉంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే సంకేతాల నేపథ్యంలో...ఆయన పాలిటిక్స్ లోకి రాకుండా కుట్ర చేస్తున్నారని, ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. నష్టపోయిన వారు ఏవిషయం అనేది నిర్మాతతో తేల్చుకోవాలి. రజనీకాంత్‌ను బదనాం చేయడం దేనికని ప్రశ్నిస్తున్నారు.

‘లింగా' డిస్ట్రిబ్యూటర్ల నిరాహార దీక్షల వెనక రాజకీయ కోణం ఉందనడానికి ‘నాన్ తమిళర్ కట్చి' పార్టీ నాయకుడు సీమాన్ కూడా పాల్గొనడమే అంటున్నారు ఫ్యాన్స్ . ‘తమిళుడే ఈ గడ్డను ఏలాలి. రజనీకాంత్ తమిళుడు కాదు. అతన్ని నాయకుడిగా మేము ఒప్పుకోం. ఆయ రాజకీయాల్లోకి వస్తే తొలి ప్రత్యర్థి తానే' అంటూ గతంలో సీమాన్ వ్యాఖ్యలు చేసారు.

మరోవైపు తమిళ నటుల సంఘమైన నడిగర సంఘం కూడా రజనీకాంత్‌కు మద్దతుగా నిలిచింది. ‘లింగా' నష్టాల విషయంలో రజనీకాంత్ ను బాధ్యుడిని చేయడం తగదని తమిళ నటుల సంఘమైన ‘నడిగర సంఘం' స్పష్టం చేసింది. ఏమైనా ఉంటే నిర్మాతతో తేల్చుకోవాలి. రజనీకాంత్ ను బ్లేమ్ చేయడం తగదని పేర్కొన్నారు.
మొత్తానికి ‘లింగా' డిస్ట్రిబ్యూటర్ల వివాదం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఈ చిత్రాన్ని రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు. ఆయన ఈ చిత్రాన్ని ఈ రోస్ ఇంటర్నేషనల్ సంస్థకు అమ్మారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నుండి స్థానిక డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరకు కొనుగోలు చేసి నష్టపోయారు.