»   » హీరోలను ఆరాధించవద్దని స్టార్ డైరక్టర్ పిలుపు

హీరోలను ఆరాధించవద్దని స్టార్ డైరక్టర్ పిలుపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పాలాభిషేకాలు, హారతి వంటివి హీరోల హోర్డింగ్ ల వద్ద యువత సినిమా విడుదల సమయాల్లో స్వంత పనులు మానుకుని చేస్తున్నారు..అటువంటి అనవరసం అంటూ పిలుపునిచ్చారు ప్రముఖ తమిళ దర్శకులు భారతీ రాజా. ఆయన తాజాగా మధురైలోని ఓ కాలేజీలోని స్టూడెంట్స్ ని ఉద్దేశ్శించి మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. అలాగే సినిమాలు అనేవి కేవలం ఆనందించటానికేనని అన్నారు. కేవలం మీ ఖాళీ సమయాన్ని మాత్రమే సినిమాలు చూడటానికి వినియోగించండి. అలాగే హీరోలను ఆరాధించకండి..వారు మనలాగే సాధారణ మనుష్యులు...మనకున్నట్లే భావోద్వేలు అన్నీ ఉంటాయని హితువు పలికారు. అలాగే చదువు అనేది విధ్యార్ధి జీవితంలో అత్యంత ముఖ్యమైనదని అన్నారు. అయితే అదే సమయంలో కళ కూడా అవసరమేనని, దానితో సమాజంలో మార్పు తేవటం సాధ్యమన్నారు. అంతేకాక నేను చదువుకోలేదు. నేను కేవలం నా చుట్టూ ఉన్న జనాన్ని మాత్రమే చదువుకున్నాను. ఆ అనుభవాలు ఆధారంగానే నేను సినిమాలు రూపొందించాను. కళ అనేది మనలోని ట్యాలెంట్ ని వెలికితీయటానికి కూడా వినియోగిస్తుందని అర్ధం చేసుకున్నాను. కాబట్టి ముందు మీరు చదువు పైన దృష్టి పెట్టండి...దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందనేది సత్యం అంటూ ముగించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu