»   » ఆ హీరోకు ముందే తెలుసా?: నోట్ల రద్దు ముందు రోజే 40 కోట్లు అప్పు తీర్చాడు

ఆ హీరోకు ముందే తెలుసా?: నోట్ల రద్దు ముందు రోజే 40 కోట్లు అప్పు తీర్చాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు విషయం ముందుగా ఎవరికీ తెలియదని ప్రభుత్వం చెప్తూనే ఉంది. అయితే కొన్ని సంఘటనలు మాత్రం మీడియాలో రకరకాల అనుమానాలకు తావిస్తోంది. రకరకాల రూమర్స్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నాయి.

రీసెంట్ గా తమిళ మీడియాలో ఓ వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. తమిళ స్టార్ హీరో ఒకరు...మోడీ ప్రకటనకు ముందు రోజు ...నలభై కోట్ల రూపాయలు అప్పు తీర్చేసారట. ఇన్నాళ్ళూ డబ్బు ఉండి, ఎన్ని సార్లు అడిగినా ఇవ్వటానికి ఇష్టపడని ఆ హీరో హఠాత్తుగా డబ్బు పట్టుకుని వచ్చి తీర్చటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Does This hero know about modi's Master Stroke earlier?

తన సినిమాలకు ఫైనాన్స్ చేసే ఫైనాన్సర్ వద్ద నుంచి ఆ హీరో నలబై కోట్లు తెచ్చి రియల్ ఎస్టేట్ లో పెట్టాడట. ఆ తర్వాత ఎన్ని సార్లు డబ్బు తీర్చమని, ఆ ఫైనాన్ససర్ వీళ్లింటి చుట్టూ తిరిగినా ఫలితం లేదట. ఇదిగో ఇస్తా..అదిగో ఇస్తా అని నాన్చాడట. దాంతో కరెక్ట్ గా మోడీ ప్రకటన కు ముందు రోజు పిలిచి ఆ నలభై కోట్లు మొత్తం తీర్చటం ఆసక్తికరంగా మారింది.

ఈ సంఘటన యాధృచ్చకమే అని ఆ హీరో అంటున్నాడట. అయితే ఫైనాన్సియర్ మాత్రం అదేం లేదు ముందుగానే ఆయనకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు నేను ఆ నలభై ని వైట్ చేయలేక ఛస్తున్నాను అని, ఆయన దగ్గరున్నది వదిలించుకున్నాడు కానీ, అప్పు తీర్చినట్లు కాదు అని అంటూ తిట్టుకుంటున్నాడట. అదంటీ మ్యాటర్. ఆ హీరో ఎవరనేది మాత్రం ఆ తమిళ మీడియా రావటం లేదు.

English summary
A young hero in Kollywood returned Rs. 40 crore loan exactly before PM Modi's surgical strike on black money.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu