నేను హీరోగా నటిస్తే దానికి ఒక ప్రత్యేకత ఉండాలి: దేవిశ్రీ
Tamil
oi-Saraswathi
By Sindhu
|
యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కి ముఖానికి రంగేసుకోవాలన్న కోరిక బాగానే వుంది. తెలుగు తెర పై తనదైన ముద్ర వేసుకున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మారిబోతున్నారు. అయితే, మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవలే 'వెడి' అనే తమిళ సినిమాలో ఓ పాటకు డ్యాన్స్ కూడా చేశాడు. దర్శకుడు ప్రభుదేవా కోరికపై ఆ పాటలో నటించానని దేవినే స్వయంగా చెబుతున్నాడు. అది చేసిన దగ్గర్నుంచీ తమిళంలో చాలా మంది తమ సినిమాలలో నటించమని అడుగుతున్నారట.
అయితే, తను హీరోగా నటించాలంటే... ఆ సినిమాకు ఓ ప్రత్యేకత వుండాలని దేవీ కోరుకుంటున్నాడు. 'నేను హీరోగా నటిస్తే కచ్చితంగా ఆ కథలో ఏదో ఒక ప్రత్యేకత వుండాలి. సినిమా చూసిన వాళ్లు 'ఇందుకే దేవీ చేశా'డని అనుకోవాలి. లేకపోతే కనుక నేను చేయడం వేస్ట్. అందుకని ఆ కథలో డ్యాన్స్ కో, మ్యూజిక్ కో ఇంపార్టెన్స్ వుండాలి" అంటున్నాడు. మరి, అలాంటి కథతో ఎవరైనా వస్తే కనుక దేవిశ్రీ చేయడానికి రెడీగా ఉన్నాడన్న మాట! అయితే స్క్రిప్ట్ నచ్చితే చేస్తాను అని అంటున్నాడు దేవి. ఓ ఇరవై ఏళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూస్తే మనమూ ఓ సినిమా చేశామని చెప్పుకోడానికి ఉంటుందని అంటున్నాడు కాబట్టి మరి అలాంటి సినిమా ఎప్పడు చేస్తాడో వేచి చూడాల్సిందే.
He recently acted, rather danced, to a song with a sizzling Sameera Reddy in a film directed by Prabhu Deva. Well, people do know he has appeared briefly with our very own megastar Chiranjeevi in a film. Doesn't he want to be a ‘hero', especially considering the fact that several people.
Story first published: Monday, October 3, 2011, 17:12 [IST]