»   » మరీ దారుణం: ఆ హత్యకు ధనుష్, శింబు కారణం అంటూ...!

మరీ దారుణం: ఆ హత్యకు ధనుష్, శింబు కారణం అంటూ...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: గత వారం రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హ‌త్య విషయం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి రామ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసారు. ఈ కేసుపై ప్రస్తుతం కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి.

అయితే ఇపుడు తమిళ సోషల్ మీడియాలో ఈ హత్య కేసులో తమిళ హీరోలు హీరో ధనుష్, శింబు పేరు లింక్ పెట్టి తెగ ప్రచారం జరుగుతోంది. టెక్కీ స్వాతిని హ‌త్య చేసిన నిందితుడు ఆమె త‌న‌ను ప్రేమించ‌న‌ని చెప్ప‌డంతో పాటు త‌న‌ను కొండ‌ముచ్చు తిట్టినందుకు కోపంతో ఈ హత్య చేసాడనే వార్తలు వచ్చాయి. ధనుష్, శింబు లాంటి హీరోల సినిమాల ప్రభావం వల్లే నిందితుడు ఈ హత్య చేసాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

Don't Blame Kollywood or Dhanush, Simbu movies for Swathi's Murder

అమ్మాయిలను వేధించడం, తిట్టడం, వెంటపడటం తమిళ సినిమాల్లో ఈ మధ్య బాగా ఎక్కువైందని, ఆ కారణంగానే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య వచ్చిన ధనుష్ 'వై దిస్ కొలవెరి' సాంగులో సాహిత్యం కూడా... నలుపు రంగబ్బాయి ప్రేమను తెలుపు రంగు అమ్మాయి ఒప్పుకోకపోతే జీవితం నాశనం చేసినట్లేనని చెప్పే విధంగా ఉందని, యువతపై బాగా ప్రభావం చూపుతున్నాయని, అందు వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి ప్రచారం దారుణం..
అయితే ఇలాంటి ప్రచారం చేయడం దారుణమని ధనుష్, శింబు అభిమానులు అంటున్నారు. సినిమాల వల్లే ఇలాంటివి జరుగుతున్నాయనడనం అర్థం లేని ఆరోపణలే అని, ధనుష్, శింబు సినిమల్లోనే కాదు, చాలా సినిమాల్లో ఎప్పటి నుండో ఇలాంటివి ఉన్నాయి. సెన్సార్ బోర్డు అనుమతి పొందిన తర్వాతే ఏ సినిమా అయినా రిలీజ్ అవుతుంది. తమ హీరోలపై ఇలా అనవసరంగా దుష్ర్పచారం చేయడం దారుణం అంటూ మండి పడుతున్నారు అభిమానులు.

English summary
Dhanush, Simbu movies Blamed by Some social media users for Swathi's Murder.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu