»   » జోష్ కార్తీకకు డైరక్టర్ వార్నింగ్...

జోష్ కార్తీకకు డైరక్టర్ వార్నింగ్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

జోష్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కార్తీక(రాధ కూతురు) ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. అయితే తమిళంలో హీరో జీవా సరసన కో అనే చిత్రంలో చేసింది. అయితే ఇటీవల మీడియా సమావేశంలో ఆమెను కథేంటి అని అడిగితే గబగబా చెప్పయ్యబోతే అక్కడున్న దర్శకుడు అడ్డుపడి నవ్వుతూ...తెరపై చూడండి అని మీడియాకు చెప్పి కట్ చేసాడుట. అయితే ఆ తర్వాత ఆమె తెలివి తక్కువ తనానికి మందలించి ఎక్కడా స్టోరీ లైన్ గురించి చెప్పద్దని, చివరకు స్నేహితుల వద్ద కూడా లీక్ చేయద్దని అన్నాడుట. ఎందుకంటే పెదవి దాటితే పృధ్వి దాటుతుందే అనే సామెత చెప్పి వివరణాత్మకంగా గతంలో జరిగిన సంఘటనలు వివరించాడుట. దాంతో ఇప్పుడు కార్తీకను ఎవరైనా ఆ చిత్రం గురించి అడిగితే నవ్వతూ తీసిపారేస్తోందిట. అంతగా పట్టుపడితే తన డైరక్టర్ ని అడగమని చెప్తోంది. ఇక కార్తీక మరో మళయాళ చిత్రంలో కూడా చేస్తోంది. ప్రముఖ చిత్రకారుడు రవివర్మ జీవిత చరిత్ర ఆధారంగా చేస్తున్న చిత్రంలోనూ ఆమె నటిస్తోంది. ఇక రాధ తన కూతురు కోసం తన పాతపరిచాలను తిరగతోడుతోందని చెన్నై వర్గాలు చెప్తున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu