For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తమిళనాడులో 'దూకుడు' ప్రస్తుత పొజీషన్

  By Srikanya
  |

  మహేష్ బాబు దూకుడు తమిళనాడులోనూ అదే రోజు రిలీజైన సంగతి తెలిసిందే.చెన్నయ్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 17 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తమిళనాడు మొత్తం మీద 42 ధియోటర్స్ కి పెరిగింది. ప్రతీ చోట కలెక్షన్స్ స్టడీగా ఉండటమే దానికి కారణం.అలాగే ఈ చిత్రానికి ఉన్న మరో రికార్డు ఏమిటంటే ఇది తమిళ డబ్బింగ్ వెర్షన్ కాకపోవటమే. ఇంతకుముందు అల్లు అర్జున్ బద్రీనాధ్, రామ్ చరణ్..మగధీర,ఎన్టీఆర్ శక్తి చిత్రాలు భారీగా డబ్ చేసి విడుదల చేసారు కానీ ఇప్పటివరకూ ఆ సినిమాలు అక్కడ ఆడలేదు. కానీ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ సాధించటం అందరినీ ఆశ్చర్యంలో పడేస్తోంది. చెన్నై లో ఇరవై ఒక్క ధియేటర్లలో రిలీజ్ అయిన తమిళేతర సినిమా దూకుడే. కేవలం బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సినిమాలు మాత్రమే తమిళనాడులో ఇంతగా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఆ తరువాత అంతటి రేంజ్ ను సంపాదించింది కేవలం మహేష్ మాత్రామే. చెన్నై లోని సత్యం సినిమాస్ అనే మల్టీప్లెక్స్ లో అన్ని దియేటర్లు ఈ వారాంతం వరకు హౌస్ పుల్ అయిపోయాయి. వేల్లూర్, కాంచీపురం, తిర్వల్లూర్, తిరిచే, మదురై, తాంబరం, హోసూర్, రామంతపురం, నాగానల్లూర్ వంటి తమిళ సిటీస్ లోష్ విడుదల అయిన తొలి తెలుగు సినిమా దూకుడే.

  మహేష్ దూకుడు చిత్రం ఇప్పటికే ఎక్కడ విన్నా చాలా పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ రిపోర్టు వినపరడుతోంది. ఈ నేపధ్యంలో ఆ చిత్రాన్ని మళకయాళంలో రీమేక్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి కొన్ని రోజుల్లో దూకుడు ఇంతకు ముందు వచ్చిన సినిమాల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అని అంటున్నారు అభిమానులు. మహేష్ బాబు, సమంత జంటగా నటించిన దూకుడు చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్నాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల్లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూ సూద్, షాయాజీ షిండే, నాజర్, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, బ్రహ్మాజీ, చంద్రమోహన్, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తుండగా...థమన్, కె.వి. గుమన్, గోపీ మోహన్, కోన వెంకట్, కోటి పరుచూరి, ఎ.ఎస్. ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, రామజోగయ్య శాస్త్రీ, భాస్కరభట్ల, విశ్వ సాంకేతిక నిపుణులు.

  English summary
  Dookudu hs been released in 17 theaters in Chennai alone and the film is being screened in as many as 42 theaters in Tamil Nadu. This is a record indeed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X