»   » ‘డోర’...నయనతార మూవీలో దెయ్యం ఎవరో తెలుసా? (టీజర్)

‘డోర’...నయనతార మూవీలో దెయ్యం ఎవరో తెలుసా? (టీజర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వినూత్న కథాంశాలతో రూపొందుతున్న చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూనే మరో వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కమర్షియల్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది అగ్రనాయిక నయనతార. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో దాస్ దర్శకత్వంలో ఓ హారర్ చిత్రం తెరకెక్కింది.

'డోర' అనే టైటిల్‌ తో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తమిళ టీజర్ రిలీజైంది. త్వరలోనే తెలుగు టీజర్ రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటి వరకు వచ్చిన హారర్ సస్పెన్స్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోంది. నయనతార పాత్ర చిత్రణ కొత్త పంథాలో వుంటుంది. ప్రతి సన్నివేశం అనూహ్యమైన మలుపులతో ఉత్కంఠభరింగా సాగుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు.

rn

భయ పెడుతున్న టీజర్

డోర తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

కథేంటి?

కథేంటి?

గతంలో ఆత్మ ఆవహించిన కారు కాన్సెప్టుతో తెలుగులో 'కారు దిద్దిన కాపురం' అనే సినిమా వచ్చి విజయవంతం అయ్యింది. ఇప్పుడు అలాగే..దెయ్యం పట్టిన కారుని మనం చూడబోతున్నాం. అయితే ఆ కారు ఎవరిదీ అంటే...నయనతార ది. దెయ్యం పట్టిన కారుతో నయనతార పడే తిప్పలే డోర కథ అంటున్నారు.

నయనతార

నయనతార

సినీ పరిశ్రమలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్న కొద్దీ విజయాలు అందుకుంటూ మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది కేరళకుట్టి నయనతార. ఇటీవల హర్రర్‌, థ్రిల్లర్‌ కథాంశంతో రూపుదిద్దుకున్న 'మాయ'లో తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు అదే తరహాలోని దెయ్యం కథతో రూపొందుతున్న 'డోరా'లో ఆమె నటిస్తోంది. దర్శకుడు సర్గుణం ఈ చిత్రానికి నిర్మాత. ఆయన సహాయకుడు దాస్‌ రామస్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

అదే ముఖ్యం

అదే ముఖ్యం

హారర్ కాన్సెప్టు సినిమాలకు మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్య. వివేక్‌ మెర్విన్‌ ఈ బాధ్యతను తీసుకున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా దినేష్‌కృష్ణన్‌ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం నేపథ్య సంగీతానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. సినిమా ఏప్రిల్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
Dora - Official Tamil Teaser released. Dora is an upcoming Indian Tamil-language horror thriller film directed by Dass Ramasamy and produced by A. Sarkunam. It features Nayanthara in the lead role. The film's production began in March 2016 and principal photography commenced in June 2016. Movie Team has a Planned to Release this movie on April 11, 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu