»   » "రాసలీలల సమాధి" నిర్మాత ఆస్తులు జప్తు: తమిళనాడు కోర్టు తుది తీర్పు

"రాసలీలల సమాధి" నిర్మాత ఆస్తులు జప్తు: తమిళనాడు కోర్టు తుది తీర్పు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో మెడికల్ సీట్లు ఇప్పిస్తానని చెప్పి 123 మంది నుంచి రూ. 85 కోట్లు నొక్కేసిన కేసులో రకరకాల నాటకాలు ఆడి చివరకు దొరికి పోయిన మదన్‌కు షా​క్‌ తగిలింది. మదన్‌కు సంబంధించిన రూ.6.35 కోట్ల స్థిరాస్తులను జప్తు చేయనున్నట్లు ఈడీ అడిషనల్‌ డైరెక్టర్‌ కేఎస్‌వీవీ. ప్రసాద్‌ శుక్రవారం తెలిపారు.

85 కోట్ల మోసానికి పాల్పడ్డారు

85 కోట్ల మోసానికి పాల్పడ్డారు

గత ఏడాది123 మంది వైద్య విద్యార్థులకు సీట్లు ఇప్పిస్తానని చెప్పి వారి తల్లిదండ్రుల నుంచి రూ. 85 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు విచారణ జరిపి పలు ఆధారాలను సేకరించారు. వసూలు చేసిన డబ్బుతో మదన్‌ పలు బినామీ పేర్లతో ఆస్తులను కూడబెట్టినట్టు విచారణలో తేలింది.

కాశీకి వెళ్లి సమాధి అవుతానంటూ

కాశీకి వెళ్లి సమాధి అవుతానంటూ

అసలు ఈ కేసులో చాలానే మలుపులున్నాయి మంచి దర్శకుడు దృష్టి పెడితే ఈ నిర్మాత కథ నే సినిమాగా తీయవచ్చు. కాశీకి వెళ్లి సమాధి అవుతానంటూ లేఖ రాసిపెట్టి మాయమైన వేందర్‌ మూవీస్‌ మదన్ ఆచూకీ దాదాపు ఆరునెలల తర్వాత దొరికింది. తాను నమ్మిన వాళ్ళే తనను మోసం చేసారనీ తాను ఇక బతకటం అనవసరం అనుకుంటున్నాననీ. ఇక తనకోసం వెతకొద్దనీ చెప్తూ రాసిన లేఖని చూడగానే తమిళ ఇండస్ట్రీలో కలకలం రేగింది.

మదన్ చనిపోయి ఉంటాడని

మదన్ చనిపోయి ఉంటాడని

అతని కోసం పోలీసు బృందాలూ, కుటుంబసభ్యులూ, స్నేహితులూ అందరూ వెతుకులాట మొదలు పెట్టారు. మదన్ చనిపోయి ఉంటాడని అతన్ని ఇక చూడలేమనీ సన్నిహితులందరూ కొన్నాళ్ళు భాదపడ్డారు. అయితే అతని చుట్టూ ఉన్న కేసు చిన్నదేం కాదు అతనే కీలకం కావటం తో పోలీసులు మాత్రం వెతుకులాట ఆపలేదు.

సకల భోగాలను అనుభవిస్తూ

సకల భోగాలను అనుభవిస్తూ

అయితే నానా తంటాలూ పడి అతన్ని పట్టుకున్న పోలీసులు మన నిర్మాత గారి "సమాధి" ఎలా ఉందో చూసి షాక్ తిన్నారు అజ్ఞాతంలో సకల భోగాలను అనుభవిస్తూ ఉల్లాసవంతమైన జీవితాన్ని గడిపాడు. గత మే నెలలో పరారైనప్పటి నుంచి మదన్ తన ప్రియురాళ్లతోనూ, అందమైన యువతులతోనే సంబంధాలు పెట్టుకుని హరిద్వార్‌, గోవా తదితర నగరాలకు వారిని వెంటబెట్టుకునే తిరగాడు.

అమ్మాయిలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ

అమ్మాయిలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ

సమాధి అవుతాను అంటూ మాయమైన మదన్ సమాధినీ అక్కడ ఉన్న అమ్మాయిలనూ చూసి షాక్ తిన్నారు పోలీసులు. ఇద్దరు అమ్మాయిలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించాడు మదనుడు. అలా పట్టుకొచ్చి విచారణ జరిపాక ఇన్నాళ్ళకి మదన్‌కు సంబంధించిన రూ.6.35 కోట్ల స్థిరాస్తులను జప్తు చేయాలంటూ తీర్పు వెలువడింది.

English summary
Enforcement Directorate has provisionally attached immovable properties of Vendhar Movies Madan estimated to be worth Rs 6.35 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu