»   » కమల్ ని ఓటేయమంటూ ఎలక్షన్ కమిషనర్ రిక్వెస్ట్, అసలేం జరిగింది?

కమల్ ని ఓటేయమంటూ ఎలక్షన్ కమిషనర్ రిక్వెస్ట్, అసలేం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రానున్న ఎన్నికలలో నేను ఓటు వేయను అని విశ్వ నటుడు కమలహాసన్ అన్న సంగతి సంచలనమైన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో తన పేరు గల్లంతైన సంగతిని గుర్తుచేస్తూ, నటుడు కమలహాసన్‌ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్‌లఖాని స్పందించారు. ప్రస్తుత ఎన్నికలకు జాబితాలో కమలహాసన్‌ పేరుందని గుర్తుచేయడంతో పాటు ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు.

ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... కమలహాసన్‌ తదుపరి చిత్రం 'శభాష్‌ నాయుడు' మే 16వ తేదీ నుంచి అమెరికాలో చిత్రీకరణ జరుపుకోనుంది. అదే రోజు పోలింగ్‌ కావడంతో 'మీరు ఓటు వేయడం లేదా?' అంటూ నగరంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కమలహాసన్‌ను విలేకరులు ప్రశ్నించారు.

'ఎవరో ఒకరు వేసేస్తారులే' అంటూ చమత్కరించిన ఆయన గత ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాలో తన పేరు గల్లంతైన విషయాన్ని గుర్తుచేశారు. తన షూటింగ్‌ షెడ్యూల్‌ను అనుసరించి ఓటు వేయడానికి ప్రయత్నిస్తానంటూ తర్వాత వివరణ ఇచ్చారు. కమలహాసన్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్‌లఖాని సత్వరం స్పందించారు.

ఈ ఎన్నికల్లో కమలహాసన్‌ పేరు ఓటర్ల జాబితాలో ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ 'డియర్‌ కమలహాసన్‌!... దయచేసి ఓటు వేయండి. మీరే ఇతరులకు ఆదర్శం' అంటూ ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా కమలహాసన్‌ ఓటరు గుర్తింపు కార్డు వివరాలను కూడా ట్విట్టర్‌లో ఉంచారు.

స్లైడ్ షోలో ..అసలేం జరిగింది..వివరాలు

ఓటు వేయను

ఓటు వేయను

మే నెల 16న తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి కదా! మీరు ఓటు హక్కు వినియోగించుకోరా? అన్న ప్రశ్నకు తాను ఓటు వేయను అన్నారు. కారణం తనకు ఓటు పట్టికలో తన పేరు లేదని వివరించారు.

ఎవరో వేసేసారు

ఎవరో వేసేసారు

గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయాలని వెళితే అప్పటికే తన ఓటును వేరెవరో వేసేశారని అన్నారు

నా పేరే లేదు

నా పేరే లేదు


ఈ సారన్నా ఓటు హక్కును వినియోగించుకోవాలని భావించగా ఓటరు పట్టికలో తన పేరే లేదన్నారని, ఎన్నికల కమిషనర్ తనకు మంచి మిత్రుడే అయినా ఏమి చేసేది అని కమల్ నిట్టూర్చారు.

ప్రస్తుతం

ప్రస్తుతం

కమలహాసన్ నటిస్తూ, రాజ్‌కమల్ ఇంటర్‌నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం శభాష్‌నాయుడు.

మూడు భాషల్లో

మూడు భాషల్లో

తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్ర నిర్మాణంలో లైక్ ప్రొడక్షన్ భాగస్వామ్యం పంచుకుంటోంది.

శృతిహాసన్

శృతిహాసన్

ప్రముఖ మలయాళ దర్శకుడు టి.కె.రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటించడం విశేషం.

రమ్యకృష్ణతో..

రమ్యకృష్ణతో..

ముఖ్యపాత్రలో రమ్యకృష్ణతో పాటు బ్రహ్మానందం సౌరభ్‌శుక్లా, ఆనంద్ మహాదేవ్, భరత్‌బహుండల్, ఫరిదాజలాల్, సిద్ధిక్, మనునారాయణన్ తదితరులు నటిస్తున్నారు.

 కమలహాసన్ మీడియాతో మాట్లాడుతూ...

కమలహాసన్ మీడియాతో మాట్లాడుతూ...

ఇది హ్యూమరస్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందించనున్నట్లు చెప్పారు.

ఇవే టైటిల్స్

ఇవే టైటిల్స్

తమిళం, తెలుగు భాషలలో శభాష్‌నాయుడు, హిందీ శభాష్‌కుండు పేరును నిర్ణయించినట్లు తెలిపారు.

దశావతారం పాత్రే...

దశావతారం పాత్రే...

దశావతారం చిత్రంలోని పది పాత్రలలో ఒకటైన బలరామ్‌నాయుడు పాత్ర విస్తరించే కథే శభాష్‌నాయుడు అని వివరించారు.

కూతురులాగే

కూతురులాగే

ఇందులో తన కూతురు శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు చెప్పారు. ఆమె చిత్రంలోనూ తనకు కూతురుగానే నటిస్తున్నారని తెలిపారు. శ్రుతితో కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు.

విదేశీయులు

విదేశీయులు

ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పలువురు విదేశీ సంగీత కళాకారులు పని చేస్తున్నట్లు వెల్లడించారు.స్టెపప్-2 చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు తమ చిత్రానికి పని చేస్తున్నట్లు చెప్పారు. మే నెల 14 నుంచి అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో రెగ్యులర్ షూటింగ్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.


నాన్నతో నటించడం గర్వంగా ఉంది: ఇలాంటి తరుణం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని నటి శ్రుతిహాసన్ చెప్పారు. ఆయన తనకు ఆర్ట్, నటన, సంగీతం అన్ని నేర్పించారని ఈ చిత్రంలో నాన్న లాంటి గొప్ప నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.

English summary
Reacting to Mr. Haasan’s comments, Chief Electoral Officer Rajesh Lakhoni immediately circulated a photograph of a voters’ list featuring the actor’s name. The official Twitter handle of the poll panel even sent out a tweet urging him to vote as he is considered a role model by all.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu