»   » రజనీ ఎలా నవ్వుతున్నారో చూడండి : 'రోబో 2.0' కొత్త ఫొటోలు, లెటెస్ట్ ఇన్ఫోతో

రజనీ ఎలా నవ్వుతున్నారో చూడండి : 'రోబో 2.0' కొత్త ఫొటోలు, లెటెస్ట్ ఇన్ఫోతో

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సౌతిండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో '2.0' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూపర్ హిట్ చిత్రం రోబోకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయిందని హీరోయిన్ అమీజాక్సన్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. దీంతోపాటు రజనీతో ఉన్న ఫొటోను అభిమానులతో షేర్ చేసారు.

ఇందులో ఆమె, సూపర్‌స్టార్‌ మెడలో పూలమాలలు ధరించి నవ్వుతూ చక్కగా కనిపించటం గమనించవచ్చు. నవంబరు 20న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

2010లో శంకర్‌-రజనీ కలయికలో వచ్చిన 'రోబో' చిత్రం కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ దానికి సీక్వెల్‌గా తీస్తున్న '2.0' చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.


'రోబో 2' లో అక్షయ్ గెటప్ లీక్...కాకి లా ఉన్నాడు (ఫొటోలు)

ఈ చిత్రంలో రజనీ సరసన అమీ జాక్సన్ జంటగా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. మరో బాలీవుడ్ నటుడు సుధన్షు పాండే కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ‌ఆర్ రెహ్మాన్ స్వరకర్త. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఓ కొత్త అనుభూతినిస్తుందని చెప్తున్నారు.

కట్టుదిట్టంగా

కట్టుదిట్టంగా

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఎందిరన్‌-2' (రోబో 2) కొన్ని నెలల క్రితం చిత్రీకరణ ప్రారంభమైంది. చెన్నైలోని ఈవీపీ స్టుడియోలో కట్టుదిట్టమైన భద్రత మధ్య సెట్స్‌పైకి వెళ్లింది.

ఆంక్షలు

ఆంక్షలు

శంకర్‌ దర్శకత్వంలో చిత్రమంటేనే కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య చిత్రీకరణ, ఆంక్షలు సహజం. ‘ఎందిరన్‌-2'కూ ఇవి కొనసాగాయి. ముందుగానే చిత్ర యూనిట్ కి గుర్తింపు కార్డులు జారీ చేశారు. మిగతావారిని అనుమతించలేదు.

రాత్రిబవళ్లూ

రాత్రిబవళ్లూ

ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన 'రోబో' సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. దానికన్నా మరింత అద్భుతంగా 'రోబో-2' చిత్రాన్ని తెరకెక్కించేందుకు శంకర్‌ చాలా కష్టపడుతున్నాడు

అక్షయ్ విలన్ గా...

అక్షయ్ విలన్ గా...

రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో.. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటిస్తున్నారు.తొలిసారిగా దక్షిణాది చిత్రంలో అక్షయ్‌కుమార్‌ నటిస్తుండటం విశేషం.

భారీగా..

భారీగా..

హాలీవుడ్‌ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాని తీస్తుండటంతో బడ్జెట్‌ భారీగానే అవుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభంలోనే కళ్లు చెదిరేలా వేసిన సెట్స్‌ కోసంకోట్లు ఖర్చు చేశారు.

ఎంతో ఆసక్తిగా..

ఎంతో ఆసక్తిగా..

రజనీకాంత్‌తో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆతృతతో ఎదురు చూసిన అక్షయ్‌ కుమార్‌ రజనీతో కలిసి నటించడం ప్రారంభించాడు.

కీ సీన్స్

కీ సీన్స్

ఈ సినిమా షూటింగ్‌ కోసం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఓ సిటీ సెట్‌ వేశారు. ఇందులో అక్షయ్‌.. రజనీల మధ్య సినిమాలోని కీలకమైన సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు. ఇందుకోసం రూ. 20 కోట్లు ఖర్చు చేశారట.

ఇంటర్వెల్ బ్లాక్

ఇంటర్వెల్ బ్లాక్

చిత్రీకరణలో సెట్‌లో భారీ యాక్షన్‌ సన్నివేశాలుంటాయని చెబుతున్నారు. దీన్ని బట్టి సినిమా ఇంటర్వెల్ అయివుంటుందని అనుకుంటున్నారు.

ఎంతవుతుందో..

ఎంతవుతుందో..

సినిమా మొదట్లోనే ఇంత ఖర్చు చేస్తే.. సినిమా పూర్తయ్యే నాటికి బడ్జెట్‌ ఎన్ని కోట్లు దాటుతుందో మరి చర్చించుకుంటున్నాయి సినీవర్గాలు.

నిజమేనా

నిజమేనా

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కే ఈ చిత్రంగా ‘రోబో 2.0' ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో అసలు ఈ చిత్రానికి ఎంత బడ్జెట్ పెడుతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతోందని నిర్మాత లైకా ప్రొడక్షన్స్ వారు ప్రకటించారు. ఇది ఇండియన్ సినిమాలోనే హై బడ్జెట్ ఇది.

త్రీడి ఫార్మెట్ లో ...

త్రీడి ఫార్మెట్ లో ...

2017 సమ్మర్ లో ఈ చిత్రం విడుదల కానుంది. 3డి ఫార్మాట్‌లో తీయనున్న ఈసినిమాని ఇంటర్నేషనల్‌గా రిలీజ్‌ చేయటానికి ప్లాన్‌చేశారు. సౌత్‌ నుంచి ఇంటర్నేషనల్‌ వరకూ ఓ సినిమాని ఒకే టైటిల్‌తో ప్రమోట్‌ చేయటానికి శంకర్‌ ఈ సినిమా టైటిల్‌ని 2.0గా మార్చినట్లు చెబుతున్నారు.

English summary
The shoot of Superstar Rajinikanth's upcoming film, '2.o' (sequel to Endhiran), has been wrapped. Also starring Amy Jackson and Sudhanshu Pandey, '2.o' is the sequel to 2010 Tamil blockbuster 'Enthiran'. The first look poster of superstar Rajinikanth's 2o will be unveiled in November.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu