twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ 'కోచ్చడయాన్‌' తిప్పలు అన్నీ ఇన్నీ కావు

    By Srikanya
    |

    చెన్నై : రజనీకాంత్ తాజా చిత్రం 'కోచ్చడయాన్‌' కి క్రేజ్ తేవాలని సినీ బృందం విశ్వప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా వారు టెక్నాలిజీని మరింతగా వాడుతున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ ఈ సినిమా ప్రమోషన్ చేస్తున్నారు. గతంలో 3డీ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తర్వాత 5డీ, 7డీ థియేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా 'ఎక్స్‌డీ' పేరిట మరో అత్యాధునిక సాంకేతిక థియేటర్‌ చెన్నైలోని ఫోనెక్స్‌ మాల్‌లో సందడి చేస్తోంది. ప్రేక్షకుడికి ఎదురుగా ఉన్న తెరమాత్రమే కాకుండా, 'ఎక్స్‌ట్రా డైమెన్షనల్‌'గా ప్రేక్షకుడికి మూడు వైపులా చిత్రం ప్రదర్శితమవడం దీని ప్రత్యేకత.

    అంతేకాకుండా 3డీ, 5డీ, 7డీలోని అన్ని ప్రత్యేకతలను కూడా కలగలపుకుని అప్‌గ్రేడ్‌ వెర్షన్‌లా ఉంటుంది. తెరలోని సన్నివేశంలో మంచు కురిసినా.. ప్రేక్షకుడిపై మంచు కురవడం, గాలులు వీయడం, కదలడం.. వంటి ప్రత్యేకతలతో అలరిస్తోంది. ఈ థియేటర్‌లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'కోచ్చడయాన్‌' ట్రైలర్‌ను ప్రదర్శిస్తున్నారు. దీనికి ప్రేక్షకులను నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఫొటో రియాలిస్టిక్‌ మోషన్‌ కాప్చర్‌కు తగ్గట్టుగా ఈ థియేటర్‌ ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇది జనాల్లోకి సినిమాని ఎంతవరకూ తీసుకువెళ్తుందనే విషయం దర్శక,నిర్మాతలు బేరేజు వేస్తున్నారు.

    Experience kochadaiyaan in XD format

    మరో ప్రక్క ఈ చిత్రం ప్రచారంలో వినూత్నంగా ముందుకుసాగుతోంది. ఈ సినిమాను తమిళం, తెలుగు, హిందీ, పంజాబీ, బోజ్‌పురి, మరాఠీ భాషలలో విడుదల చేయనున్నారు. మరో వైపు ఈ చిత్ర ప్రచారానికి గాను 3650 హోర్డింగులు, బ్యానర్లను తమిళనాడుతోపాటు కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని భారత్‌ పెట్రోలియం బంకుల వద్ద ఏర్పాటు చేయనున్నారు. చెన్నైలో మాత్రమే వంద హోర్డింగులు అమర్చుతున్నారు. పెర్‌ఫార్మన్స్‌ మోషన్‌ క్యాప్చరింగ్‌ విధానంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీ సరసన దీపికా పదుకొణే నటించింది.

    'రోబో' తర్వాత రజనీకాంత్‌ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్‌స్టార్‌. సీనియర్‌ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్‌గా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే ట్రైలర్‌ విడుదల చేశారు.

    'విక్రమ్ సింహా' చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

    English summary
    It was a different experience, as the trailer of Superstar Rajinikanth's Kochadaiiyaan was screened at XD Cinema at Phoenix Market City in Velachery in Chennai. XD Cinema is a special theater where whatever happens in the movie scenes happens to the viewers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X