twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోలీసుపై ఫేక్ న్యూస్ షేర్ చేసిన సింగర్ చిన్మయి... సారీ చెబుతూ ట్వీట్ డిలీట్!

    |

    Recommended Video

    Police Fires On Singer Chinmayi False Tweet

    ఇండియాలో #మీటూ ఉద్యమం ఊపందుకున్న తర్వాత దాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళుతున్న వారిలో సౌతిండియా నుంచి సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. మహిళలు, ఆడ పిల్లలపై అత్యచారాలు, లైంగిక వేధింపులకు గురి చేస్తున్న వారిని టార్గెట్ చేస్తూ ఆమె కొంతకాలంగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.

    ఈ క్రమంలోనే ప్రముఖ తమిళ రచయిత వైరముత్తుతో పాటు మరికొందరు సెలబ్రిటీల నిజస్వరూపాన్ని బయట పెడుతూ... వీరు తెరవెనక చేసే చీకటి పనులు, లైంగిక వేధింపుల పర్వాన్ని బట్టబయలు చేసి సంచలనం క్రియేట్ చేసింది. ఈ క్రమంలో తనను ఇండస్ట్రీలో అవకాశాల పరంగా ఇబ్బందులకు గురి చేసినా ఏ మాత్రం భయపడకుండా ముందుకు సాగుతున్నారు.

    పోలీసు లైంగికంగా వేధించాడని వైరల్ ట్వీట్ షేర్ చేసిన చిన్మయి

    పోలీసు లైంగికంగా వేధించాడని వైరల్ ట్వీట్ షేర్ చేసిన చిన్మయి

    ఇటీవల సింగర్ చిన్మయి యూపీలో ఓ పోలీసు గురించి చేసిన ట్వీట్ సంచలనం అయింది. ఉత్తప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ పోలీసు అత్యాచార బాధితురాలిని కోర్కె తీర్చాలని వేధింపులకు గురి చేసినట్లుగా ట్విట్టర్లో ఓ పోస్ట్ వైరల్ అయింది. దీనిపై చిన్మయి స్పందిస్తూ ‘చట్టాన్ని కాపాడాల్సిన పోలీసే ఇలా ప్రవర్తిస్తే ఎలా?' అంటూ ట్వీట్ చేశారు.

    ఫేక్ న్యూస్ అంటూ యూపీ పోలీస్ శాఖ ఆగ్రహం

    చిన్మయి చేసిన ఈ ట్వీట్‌పై ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ స్పందించింది. అది ఫేక్ న్యూస్ అని తేల్చి పారేసింది. 2017లో జరిగిన ఘటన గురించి 2019లో ఓ సెలబ్రిటీ పోస్ట్‌ చేయడం తాము ఊహించలేదని యూపీ పోలీస్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

    అసలు విషయం ఇదీ...

    అసలు విషయం ఇదీ...

    అప్పట్లో సదరు మహిళ తనపై అత్యాచారం జరిగిందని తప్పుడు కేసు పెట్టింది. ఫిర్యాదు తీసుకున్న ఎస్సై కూడా తనను లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది. విచారణలో ఆమె ఆరోపణల్లో నిజం లేదని తెలిసిన తర్వాత కేసు కొట్టివేయడం జరిగిందని యూపీ పోలీసులు వివరణ ఇచ్చారు.

    క్షమాపణ చెప్పి ట్వీట్ డిలీట్ చేసిన చిన్మయి

    క్షమాపణ చెప్పి ట్వీట్ డిలీట్ చేసిన చిన్మయి

    ఇలాంటి ఘటనలు జరినపుడు మహిళల్లో చైతన్యం రావాలని, బాధితులకు న్యాయం జరుగాలనే ఉద్దేశ్యంతోనే నేను వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాను. నేను చేసిన ట్వీట్లో పొరపాటును గమనించినందుకు ధన్యవాదాలు. ఇందుకు నేను క్షమాపణలు చెబుతూ ట్వీట్ డిలీట్ చేస్తున్నట్లు చిన్మయి తెలిపారు.

    English summary
    "Meanwhile it is not expected of celebrities to post a #FakeNews of 2017 in 2019. Meanwhile the victim had lodged a fake gang rape case which the SI had exposed hence revengeful. Meanwhile t charges against SI were found false after proper investigation & voice sampling test." UP Police on singer Chinmayi fake tweet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X