»   » రజనీకాంత్‌ ఆరోగ్యం విషమం అంటూ...

రజనీకాంత్‌ ఆరోగ్యం విషమం అంటూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అనారోగ్యానికి గురైనట్టు శనివారం వార్తలు సంచలనం సృష్టించాయి. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రజనీకాంత్‌ శుక్రవారం రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రిలో చేర్పించారనే విషయాన్ని ఓ నిర్మాత పేరుతో ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

దీంతో ఈ విషయం రాత్రికిరాత్రే రజనీకాంత్‌ అభిమానులను కలవరపెట్టింది. రాత్రి నుంచి మీడియా కార్యాలయాలకు అభిమానులు ఫోన్లు చేసి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

కానీ రజనీకాంత్‌ ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం 'విక్రమసింహా'(కోచ్చడయాన్‌) చిత్రానికి రెండోభాగం డబ్బింగ్‌ చెబుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి. అనారోగ్యంపై వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.

తీరా విచారణలో ఆ నిర్మాత వీటీవీ గణేశ్‌గా తేలింది. ఈ విషయమై ఆయనతో మాట్లాడగా.. తాను అసలు ట్విట్టర్‌లో లేనని, ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తన పేరిట అకౌంట్‌ కొనసాగిస్తున్నారని అన్నారు.

English summary
Producer-actor VTV Ganesh has denied the rumours spread by the fake twitter account in his name. An anonymous user who had a fake account in the name of VTV Ganesh had tweeted about Superstar Rajinikanth's health.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu