For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆక్రమణ: హీరో మాధవన్‌ పై కలెక్టరుకు రైతుల ఫిర్యాదు

  By Srikanya
  |

  చెన్నై : సాగునీటి కాలువ భూములను ఆక్రమించినట్లు హీరో మాధవన్‌పై దిండుకల్‌ జిల్లా కలెక్టరుకు రైతులు ఫిర్యాదు చేశారు. దిండుకల్‌ జిల్లా పళని సమీపంలోని విలాంగోంబై తేక్కన్‌ ఫార్మ్‌లోని టీటీఎల్‌ సాగునీటి కాలువను ఆయన ఆక్రమించుకున్నారని దిండుకల్‌ జిల్లా కలెక్టరు కార్యాలయంలో జరిగిన రైతు సమస్యల పరిష్కార కార్యక్రమంలో కలెక్టరు హరిహరన్‌కు తేని రైతులు ఫిర్యాదు చేశారు.

  కొన్నేళ్ల కిందట ఏడెకరాల భూమిని కొనుగోలు చేసిన మాధవన్‌ ఆ తర్వాత సాగునీటి కాలువను ఆక్రమించుకుని విద్యుత్తు కంచె ఏర్పాటు చేసుకున్నారని, దీనికి రెవెన్యూ అధికారులు కొందరు సహకరించారని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయాలని రెవెన్యూ, ప్రజాపనులశాఖ అధికారులను దిండుకల్‌ జిల్లా అధికారులు ఆదేశించారు.

  మాధవన్‌ ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. మణిరత్నం'సఖి' , యువ చిత్రాలతో తెలుగునాట సైతం ఫ్యాన్స్ ని క్రియేట్ చేసుకున్న మాధవన్.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  Farmers file land encroachment complaint against actor Madhavan

  'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌'తో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన మాధవన్‌ ఈ మధ్యనే 45వ ఏట అడుగుపెట్టాడు. సినిమా తారలు తమ వయసు చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు. అయినా అదేం దాస్తే దాగేది కాదు. ఒకవేళ ఎవరైనా తమ వయసు చెప్పకుండా దాస్తున్నారంటే వాళ్లు అభద్రతా భావంలో ఉన్నట్లే'' అంటున్నాడు మాధవన్‌.

  పుట్టిన రోజు వేడుకల గురించి చెబుతూ ''ఏటా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండేవాడిని. ఈ సారి మాత్రం స్నేహితులు, పరిశ్రమలోని కొంతమంది మిత్రుల సమక్షంలో పుట్టిన రోజు జరుపుకోవాలనుకుంటున్నాను. నాపై వాళ్లు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నా తొమ్మిదేళ్ల కొడుకు నా కోసం ప్రత్యేకంగా ఒక గ్రీటింగ్‌ సిద్ధం చేశాడు. దాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది''అన్నాడు మాధవన్‌.

  సినిమాల విషయానికి వస్తే..

  2011లో విడుదలైన 'తను వెడ్స్‌ మను' మంచి విజయం సాధించింది. మాధవన్‌, కంగనా రనౌత్‌ జంటగా నటించిన ఈ చిత్రం చక్కటి కథ, కథనాలతో అటు ప్రేక్షకులను ఇటు పరిశ్రమను ఆకట్టుకుంది. ఈ చిత్రం 'మిస్టర్‌ పెళ్ళికొడుకు'గా తెలుగులోనూ రీమేకైంది. నాలుగేళ్ల తర్వాత దర్శకుడు ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ 'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌' పేరిట ఆ చిత్రానికి సీక్వెల్‌ను తీసుకొస్తున్నారు. ఈ చిత్రం ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం సాధించింది.

  .తను, మనుల మధ్య జరిగే ప్రేమకథగా మొదటిభాగం తెరకెక్కింది. లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నా సంప్రదాయాలను గౌరవించే మనోజ్‌ శర్మ(మను)గా మాధవన్‌, మగరాయుడిలాంటి అల్లరి అమ్మాయి తనూజ త్రివేది(తను)గా కంగనా అందులో కనిపించారు. రెండు భిన్న ధ్రువాల్లాంటి వీరు కొన్ని విచిత్ర పరిస్థితుల్లో ప్రేమలో పడతారు. ఆ తర్వాత వారి ప్రేమకథ ఎన్నో మలుపులు తిరిగి చివరికి పెళ్లితో సుఖాంతమవుతుంది.

  రొమాంటిక్‌ కామెడీగా రూపొందిన ఈ చిత్రంలో మాధవన్‌, కంగనా పండించిన కెమిస్ట్రీ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది. తను, మనుల వైవాహిక జీవితంలో చోటుచేసుకునే సంఘటనల నేపథ్యంలో రెండో భాగాన్ని తెరకెక్కించారు. అచ్చం తనును పోలిన అమ్మాయి అనుకోకుండా వీరి జీవితాల్లో అడుగుపెడుతుంది. తను మనస్తత్వానికి భిన్నంగా ఉండే ఆ అమ్మాయి పట్ల మను ఆకర్షితుడవుతాడు. అప్పుడు తను, మనుల వైవాహిక జీవితంలో చోటుచేసుకునే పరిణామాలేమిటన్నది తెలుసుకోవాలంటే 'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌' చూడాల్సిందే.

  'క్వీన్‌'తో జాతీయ పురస్కారం అందుకున్న కంగనా తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇదే కావడం విశేషం. మొదటి భాగంలోని తను పాత్రకు తోడు కుసుం దత్తో సాంగ్వన్‌ అనే హరియాణీ అథ్లెట్‌గానూ నటించింది.

  English summary
  The farmers of Dindigul have lodged a complaint on actor Madhavan for encroaching irrigation canal at Thekkan Thottam area near Dindigul.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X