డిజిటల్ ఫిల్మ్ మేకింగ్, స్క్రీన్ రైటింగ్ పై కమల్ హాసన్ సదస్సు
కమల్ హాసన్ మాట్లాడుతూ... ''సినీ, మీడియా, ప్రభుత్వ విభాగాలకు చెందిన 600 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటారు. వందేళ్ల భారతీయ సినిమా, రానున్న శతాబ్దంలో సవాళ్లు, అవకాశాలు, సినిమాలో మహిళల పరిణామక్రమం, మీడియా వార్తల్లో విశ్వసనీయత, డిజిటల్ సౌండ్ టెక్నాలజీ, డిజిటల్ ఫిల్మ్ మేకింగ్, స్క్రీన్‌రైటింగ్... ఇలాంటి పలు కీలక అంశాలపై చర్చలు నిర్వహిస్తాం. గ్రాఫిక్ రంగంలో సంచలనాలు సృష్టించిన 'హ్యారీపాటర్ అండ్ డెత్లీ హాలోస్', 'రోబో' చిత్రాలను రూపొందించిన విధానాన్ని ఆయా చిత్రాల గ్రాఫిక్ నిపుణులు ఈ సదస్సులో వివరిస్తారు'' అని తెలిపారు.
ఇక కమల్‌హాసన్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, పి.వి.పి. సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మరోసారి రిలీజ్ వాయిదా పడింది. జనవరి 2013 లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం లేటు అవటానికి కారణం..ఈ చిత్రంలో విప్లవాత్మకమైన ఆరో 3D ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం. ఈ టెక్నాలిజీతో సినిమాని మిక్సింగ్ చేయటానికి మరింత సమయం పడుతుంది. అందుకే లేటు అని చెన్నై వర్గాల సమాచారం. ప్రస్తుతం చెన్నైలో ఈ కన్వర్షన్ వర్క్ జరుగుతోంది.
మరో ప్రక్క ఈ చిత్రం విడుదల కాకపోవటానికి కారణం డిస్ట్రిబ్యూటర్స్ కరువు అని ప్రచారం జరుగుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తయారుకావటంతో ఈ సినిమాకు ఎక్కువ రేట్లు చెప్తున్నారని అందుకే బిజినెస్ కావటంలేదని అంటున్నారు. బిజినెస్ మొదలైన వెంటనే రిలీజ్ డేట్ అపీషియల్ గా ప్రకటిస్తారని చెప్తున్నారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ సాంకేతిక నిపుణుల సహకారంతో అమెరికాలో నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకీ తీవ్రవాద కార్యకలాపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనాన్ని చర్చిస్తూనే... వారి పని తీరుని, ఆలోచనల్నీ తన చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. తీవ్రవాదం గురించి కమల్ చిత్రంలో ఏం చర్చించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తెరపై ఆయన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications












