»   »  సినిమా ఆగిపోలేదని క్లారిఫై చేసాడు

సినిమా ఆగిపోలేదని క్లారిఫై చేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : గౌతంమీనన్‌ దర్శకత్వంలోని 'వినైతాండి వరువాయా' చిత్రం శింబుకు బిగ్గెస్ట్‌ హిట్‌ను అందించిన విషయం తెలిసిందే. యువతను అమితంగా ఆకట్టుకుందీ సినిమా. మళ్లీ శింబుతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు గౌతంమీనన్‌ ప్రకటించారు. 'సట్టెండ్రు మారుదు వానిలై' అని పేరుపెట్టారు కూడా. కొన్ని రోజుల పాటు చిత్రీకరణ జరిగింది.

తర్వాత గ్యాప్‌ లభించడంతో మరో చిత్ర కథను సూర్యకు వినిపించారు గౌతం. సూర్యకు నచ్చకపోవడంతో.. ఆ కథ అజిత్‌ చెంతకు చేరింది. అజిత్‌ ఒప్పుకోవడంతో సినిమా షూటింగ్‌ను కూడా ఆరంభించేశారు గౌతం. దీంతో శింబు చిత్రం తాత్కాలికంగా ఆగింది. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయిందని ప్రస్తుతం కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Film with Gautham Menon not shelved: Simbu

దీని గురించి శింబు మాట్లాడుతూ.. '' గౌతం మీనన్‌ దర్శకత్వంలోని చిత్రం డ్రాప్‌ కాలేదు. అజిత్‌ చిత్రం వేగంగా సాగుతున్నందువల్ల తాత్కాలికంగా ఆగింది. ఆ సినిమా ముగిశాక.. తమ సినిమా ప్రారంభమవుతుంది''అని పేర్కొన్నారు.

English summary
Simbu has clarified that his upcoming Tamil romantic drama Sattendru Maraathu Vaanilai with Gautham Vasudev Menon has not been shelved. He says the project has been put on hold as the filmmaker first needs to complete his project with Ajith Kumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X