మణిరత్నం సినీ సెట్ గోదాములో అగ్నిప్రమాదం

బుధవారం మణిరత్నానికి చెందిన గోదాము నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకి చేరుకుని గంటపాటు శ్రమించి మంటల్ని అదుపుచేశారు. అప్పటికే సామగ్రి బూడిదైంది. నష్టం రూ.లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.
'కడలి' చిత్రంతో భారీ అపజయాన్ని చవి చూసిన దర్శకుడు మణిరత్నం మరో సినిమాకు సిద్ధం అయ్యాడు. ఇండో-పాక్ సంబంధాలు నేపథ్యంగా దర్శకుడు మణిరత్నం ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించక పోయినా...'లజ్జో' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రం కోసం తొలుత బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో సంప్రదింపులు జరిపిన మణిరత్నం....తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుని ముగ్గురు కథానాయకులతో ఈ చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నట్లు చెన్నై టాక్. తన ద్వారా వెండితెరకు పరిచయమైన మాధవన్, అరవింద స్వామి, గౌతమ్ కార్తీక్‌లతో ఈ సినిమా చేయాలని భావిస్తున్నాడట.
ఇక ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు భాషల్లో నిర్మితమవుతుంది. భారత్-పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం అందరికీ తెలిసిందే. భారత్-పాకిస్తాన్ విడిపోయిన సందర్భాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని, దానికి కాస్త ప్రేమకథను కూడా జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. సంచలన చిత్రాలను తెరకెక్కించే మణిరత్నం కథకు ఇప్పుడు ఈ అంశమే ముడిసరకుగా మారినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











