twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫస్ట్ లుక్ పగలకొట్టారు(ఫొటో)

    By Srikanya
    |

    చెన్నై : ఫస్ట్ లుక్, టీజర్ లతోనే సినిమాపై క్రేజ్ క్రియేట్ చేసే ప్రయత్నాల్లో ఉంటున్నారు నేటి తరం దర్శకులు. తాజాగా తమిళ హీరో కార్తీ చిత్రం 'మద్రాస్ ' ఫస్ట్ లుక్ విడుదలైంది. అట్టకత్తి ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకుముందు ఈ చిత్రానికి కాళి అండ్ కబాళి అనే టైటిల్ పెట్టారు. కానీ మద్రాస్ టైటిల్ బాగుంటుందని ఖరారు చేసి ఇలా ఫస్ట్ లుక్ వదిలారు.

    ఇక ఈ 'మద్రాస్ ' చిత్రం రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. నా పేరు శివ తరహాలో ఈ చిత్రం ఆకట్టుకుంటుందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. అవారాతో తెలుగులోనూ అదరకొట్టిన కార్తీ ఈ చిత్రాన్ని ఇక్కడా రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక కార్తీ సినిమాలు తెలుగులో వరస ఫ్లాఫులు కావటంతో ఇక్కడ బిజినెస్ సైతం డల్ అయ్యింది. అయితే మరో ప్రక్కన 'ఆల్‌ఇన్‌ఆల్‌ అళగురాజా' ని డబ్బింగ్ చేసి వదలాలని ప్లాన్ చేస్తున్నారు.

    ఈ చిత్రంలో ప్రేమ, హాస్యం కలగలిపి కార్తీ నటించనున్నాడు. సాధారణ మాటల్లో దాగున్న హాస్యాన్ని వెతికి మరీ.. తెరపై వెదజల్లి చిరునవ్వుల పంటను పండించడంలో దర్శకుడు రాజేష్‌ సిద్ధహస్తుడు. 'ఎస్‌ఎంఎస్‌', 'బాస్‌ ఎనగర బాస్కరన్', 'ఓకే ఓకే' వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ మూడు చిత్రాల్లోనూ ఒకే శైలి హాస్యం ఉన్నా.. భిన్నమైన సన్నివేశాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇప్పుడీ చిత్రం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని చెప్తున్నాడు.

    First Look: Karthi in Madras!

    చిత్రం కథ గురించి దర్శకుడు మాట్లాడుతూ... నా సినిమా వన్‌లైన్‌ కథేనండి. ఈగో ప్రేమికుడు, పొగరుబోతు ప్రియురాలు.. చివరకు ఎలా కలసిశారన్నదే 'ఎస్‌ఎంఎస్‌'. ఏమాత్రం బాధ్యత లేని కుర్రాడు ఇంటిని చక్కబెట్టే వదిన వచ్చిన తర్వాత ఎలా మారాడన్నదే 'బాస్‌', పాండిచ్చేరిలో జరుగుతున్న ప్రియురాలి పెళ్లిని ఓ యువకుడు తన స్నేహితుడితో వెళ్లి ఆపుతాడా.. లేదా.. అన్నదే 'ఓకే ఓకే'. ఈ వన్‌లైన్‌ కథకు సాధారణ హాస్యాన్ని జత చేస్తాం అంతే.

    ఇక 'ఆల్‌ఇన్‌ఆల్‌ అళగురాజా' గురించి చెప్పాలంటే.. పట్టణంలో పెరిగే ఓ యువకుడికి తన తల్లిదండ్రులే దైవాలు. ఈ అంశంతో హాస్యం, ప్రేమ, సెంటిమెంట్‌ కలగలిపి సినిమాగా తెరకెక్కుతోంది. ఓ తిరునాళ్లకు వెళ్లొచ్చిన అనుభూతి కలుగుతుంది ఈ చిత్రాన్ని చూసొచ్చిన ప్రేక్షకుడికి అన్నారు. అలాగే హాస్యం మాత్రమే నా స్క్రిప్టు కి ప్రాణం. కానీ గత చిత్రాల్లో లేని సెంటిమెంట్‌ను ఈ సినిమాలో కొత్తగా చేర్చా. అంతేకాదు.. మూడు సినిమాల్లో మాదిరిగా సంతానానికి పంచ్‌లు ఇవ్వలేదు. బాడీలాంగ్వేజ్‌తోనే నటించమని చెప్పేశా. ఈ సినిమా కోసం సంతానం హోంవర్క్‌ చేశాడు. స్పాట్‌లో సింగిల్‌ షాట్‌లోనూ కానిచ్చేస్తున్నాడు. ఆయన హిట్‌రేట్‌ పెరిగేకొద్దీ నటన కూడా అలానే ఉంది అన్నారు.

    English summary
    
 Here is the first look poster of Karthi and Catherine Tresa starrer 'Madras' which is being directed by Ranjith (Attakathi fame).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X