మణిరత్నం 'కడలి' హీరోయిన్ ఫస్ట్ లుక్ (ఫొటో)

By Srikanya

చెన్నై: అందరినీ ఊరిస్తూ వచ్చిన మణిరత్నం చిత్రం 'కడలి'హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. మాజీ హీరోయిన్ రాధ రెండవ కూతురు తులసి ఈ చిత్రం ద్వారా పరిచయమవుతోంది. రాధ పెద్ద కుమార్తె కార్తీక తెలుగు సినిమా 'జోష్‌' ద్వారా తెరంగేట్రం చేసింది. మణిరత్నం చేతుల మీదుగా చిన్న కుమార్తె తులసిని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు రాధ. తమిళ చిత్రం 'కడల్‌' (తెలుగులో 'కడలి') ద్వారా తులసి నటిగా తొలి అడుగులు వేసింది.

ఈ సినిమాలోని తులసికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ని చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం సమకూర్చారు. ఈ నెల 17న పాటలు విడుదల చేయనున్నారు. ఫస్ట్‌లుక్‌ విడుదల అనంతరం మీడియాతో తులసి ముచ్చటించింది. ఆమె మాట్లాడుతూ...''చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తరవాత పత్రికలతో మాట్లాడటం ఇదే తొలిసారి. నా ఫొటోని పత్రికల్లోనూ, టీవీల్లోనూ చూసుకోవాలని ఎన్నాళ్ల నుంచో వేచి చూశా. ఇప్పటికి ఆ కోరిక నెరవేరింది'' అంది.

అలాగే ''నటనంటే చాలా ఇష్టం. నా సంభాషణలు నేనే చెప్పుకోవాలి. అందుకే ప్రస్తుతం ట్యూషన్‌కు వెళ్లి తెలుగు, తమిళం నేర్చుకుంటున్నా. మణిరత్నం సార్‌ చిత్రం ద్వారా పరిచయమవడం నిజంగానే అదృష్టం. నేనెలాంటి పాత్రలో కనిపించాలనుకున్నానో.. అలాంటిదే 'కడల్‌'లో దక్కింది. ఇక నా దృష్టంతా సినిమా విడుదలపైనే. నటిస్తుండటం ఆనందంగా ఉన్నా.. సినిమా విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ భయంగా ఉంది'' అని చెప్పుకొచ్చింది.

ఇక''కార్తీక్‌ అంకుల్‌, అమ్మ కలసి 'అలైగల్‌ ఓయ్‌వదిల్త్లె' ద్వారా చిత్రసీమకు పరిచయమయ్యారు. ఇప్పుడు వాళ్లబ్బాయి గౌతమ్‌ కార్తిక్‌, నేను కలసి 'కడల్‌' ద్వారా పరిచయమవడం నిజంగానే ఆశ్చర్యంగా ఉంది'' అని వివరించింది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సృష్టించుకున్న 'కడల్‌' త్వరలో ఆడియో వేడుకను జరుపుకోనుంది. నవరస నాయకుడిగా ప్రత్యేకస్థానం సంపాదించుకున్న నటుడు కార్తీక్‌. 'అలైగల్‌ ఓయువదిలై', 'కిలక్కవాసల్‌', 'అమరన్‌', 'అగ్నినక్షత్రం', 'చిన్నజమీన్‌' తదితర చిత్రాల్లో నవరస నటన ప్రదర్శించి జనాల్ని మెప్పించాడు.

ప్రస్తుతం కార్తీక్ కుమారుడు గౌతమ్‌ కార్తీక్‌ను హీరోగా పరిచయం చేస్తూ మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రమే 'కడల్‌'. ఇదే సినిమా ద్వారా రాధ చిన్నకుమార్తె తులసి నాయికగా తెరంగేట్రం చేస్తోంది. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు అందిస్తున్నారు. జనవరిలో ప్రేక్షకుల చెంతకు రానుంది. ఈ నేపథ్యంలో ఈనెల 17న పాటల్ని ఆవిష్కరించనున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X