»   » నెక్ట్స్ మూవీలో విక్రమ్ స్టన్నింగ్ లుక్ (ఫస్ట్ లుక్)

నెక్ట్స్ మూవీలో విక్రమ్ స్టన్నింగ్ లుక్ (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ హీరో విక్రమ్ సినిమా సినిమాకు డిఫరెంట్ లుక్ తో కనిపిస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఆనంద్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఇరు ముగన్' సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ ఎవరూ ఊహించని విధంగా డిఫరెంటుగా ఉంది. ఈ చిత్రంలో విక్రమ్ రెండు డిపరెంట్ క్యారెక్టర్లలో కనిపిస్తారట.

అందులో ఒకటి హీరోగా అయితే, మరొకటి హిజ్రాగా నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో నటించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. త్వరలోనే దీనికి సంబందించిన షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.

First Look: Vikram's 'Iru Mugan'

ఈ చిత్రంలో విక్రమ్ సరసన నయనతార, నిత్యా మీనన్ నటిస్తున్నారు. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శిబు థమీన్స్ నిర్మాత. సినిమా తొలి షెడ్యూల్ మలేషియాలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో విక్రమ్ కు పెద్ద హిట్స్ ఏమీ లేవు. గతేడాది శంకర్ దర్శకత్వంలో చేసిన ‘ఐ' చిత్రం కలెక్షన్లు రాబట్టినప్పటికీ అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. ఈ నేపథ్యంలో 2016లో ఓ భారీ విజయం తన ఖాతాలో వేసుకోవాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు విక్రమ్.

English summary
First Look Poster of Vikram's upcoming flick 'Iru Mugan' is very unique and it gives a feeling that he is trying something very different again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu