»   » తొలి సినిమా రిలీజ్ కాకుండానే బ్రహ్మరథం పడుతున్నారా...!?

తొలి సినిమా రిలీజ్ కాకుండానే బ్రహ్మరథం పడుతున్నారా...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేశముదురుగా పరిచయమై మస్కాకొట్టించిన హన్సిక టాలీవుడ్ లో ఫెయిలైనా కోలీవుడ్ లో మాత్రం బాగా సక్సెస్ అయింది. అది కూడా తను నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే ఏకంగా నాలుగు సినిమాలలో నటించేస్తోంది. నిజంగా ఇదొక కొత్త పోకడనే చెప్పాలి. ఇలా అరుదుగా జరుగుతుంటుంది. అందుకే హన్సికకు కోలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కాగా, తను తమిళంలో నటించిన తొలి సినిమా 'మాపిళ్లై' విడుదలకు సిద్ధమైంది. ఆడుకులం వంటి మాస్ చిత్రం తర్వాత ఓ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే సీనియర్ సెక్సీ ఆర్టిస్ట్ మనీషా కోయిరాల ఓ డామినేటింగ్ మదర్ ఇన్ లా పాత్రలో నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదలకు సిద్దమౌతోంది. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ...

తమిళంలో తనకిది 'తొలి సినిమా అయినా కూడా చాలా థ్రిల్లింగ్ గా వుంది. ఆ వాతావరణమంతా మొదట్లో నాకు కొత్తగా అనిపించేది. దానికి తోడు తమిళ్ అసలు తెలియదు. దాంతో, ఎవరితోనూ మాట్లాడకుండా ఓ మూలగా కూర్చునేదాన్ని. తర్వాత ధనుష్ నా బాధ అర్ధం చేసుకుని తనే వచ్చి మాట్లాడేవారు. ఆయనే నాకు తమిళం కూడా నేర్పారు. మంచి నటుడే కాదు, మంచి హ్యూమన్ బీయింగ్ పర్సానాలిటీ కూడా"ఈ సినిమా చేస్తుండగానే నా గురించి ఎంక్వయిరీలు వచ్చాయి. వెంట వెంటనే మరో మూడు ఆఫర్లు వచ్చేశాయి. సో... నేనంతగా కష్టపడకుండానే, తొలి సినిమా రిలీజ్ కాకుండానే అక్కడ నాకొక ఇమేజ్ వచ్చేసింది. తెర మీద ప్రేక్షకులు నన్నింకా చూడకుండానే నన్ను అభిమానించడం ప్రారంభించారు. అందుకే, వారి అభిమానాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తున్నాను. మంచి సినిమాలు ఎంచుకుంటున్నాను అని అంటోంది ఈ దేశముదురు.

English summary
Dhanush starrer Mapillai is all set to grace the silver screens on April 8th, 2011. The film makers have planned accordingly as the collections doesn’t get affected by the world cup season.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu