»   » కమల్ నా కథ దొంగిలించారు, ఇళయారాజాకు హార్మోనియం పట్టుకునే అర్హత లేదు

కమల్ నా కథ దొంగిలించారు, ఇళయారాజాకు హార్మోనియం పట్టుకునే అర్హత లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఈ ఆరోపణలు చేస్తున్నది మరెవరో కాదు..ఇళయరాజా సోదరుడు గంగై అమరన్. గత కొద్ది రోజులుగా ఇళయరాజాకు , గంగై అమరన్ కు మధ్య రిలేషన్స్ సరిగా లేవు. ఈ ఆరోపణలతో మరింతగా విభేధాలు పెరిగినట్లు అర్దమవుతోంది. ఆయన తన సోదరుడుపైనా, సన్నిహితుడు కమల్ పైనా చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి.

ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ..ఇళయరాజా తనని ఒకసారి చిన్నైవర్ (1992) విషయంలో ఛాలెంజ్ చేసారని, తను డైరక్ట్ చేసిన ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవుతుందని అన్నారని చెప్పుకొచ్చారు.

అయితే తాను తన సినిమాపై కాన్ఫిడెన్స్ తో ఉన్నానని, సినిమా కనుక హిట్టైతే కనుక తను తన హార్మోనియం ను ఎప్పుడూ ముట్టుకోనని అన్నారుని , తను ఊహించినట్లుగానే సినిమా పెద్ద హిట్టైందని, అనుకున్నదాని ప్రకారం హార్మినియం ను ఇళయరాజా వదిలేయాలని, కానీ ఆయన ఆ పనిచేయలేదని ఎద్దేవా చేసారు.

ఇళయరాజా 1000 వ చిత్రం తారతప్పటైకి ప్లే బ్యాక్ మ్యూజిక్ అవార్డ్ ని నేషనల్ అవార్డ్ కమిటీ ప్రకిటించింది. దానిని ఇళయరాజా రిజెక్టు చేసారు. ఆ జ్యూరీలో గంగై అమరన్ ఉన్నారు. ఇక కమల్ కథ దొంగిలించారంటూ ఆయన ఆరోపణలు చేసారు. అవేమిటంటే..

ఆ కథనే..

ఆ కథనే..

కమల్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచిన క్షత్రియపుత్రుడు కథ..గంగై అమరన్ దే అని ఆయన చెప్తున్నారు.

చిన్నైవర్ తర్వాత

చిన్నైవర్ తర్వాత

అలాగే తాను ఆతి వీరపాండ్యన్ అనే కథ తయారు చేసుకున్నాని, చిన్నైవర్ తర్వాత ఆ సినిమా డైరక్ట్ చేసుకోవాలనుకున్నారని, అదే క్షత్రియపుత్రుడు కథ అని చెప్పారు.

ఇళయరాజా దెబ్బ కొట్టారు

ఇళయరాజా దెబ్బ కొట్టారు

కమల్ తో తాను ఆ ప్రాజెక్టు చేద్దామనుకుంటే తన సోదరుడు ఇళయారాజా...తను బ్యాడ్ ఫిల్మ్ మేకర్ ని అని కమల్ తో చెప్పి చెడ కొట్టారన్నారు.

దొంగతనం చేసారు

దొంగతనం చేసారు

కమల్ కు తాను నేరేట్ చేసిన ..ఆతి వీరపాండ్యన్ కథనే కొద్ది పాటి మార్పులతో క్షత్రియపుత్రుడుగా తెరకెక్కించారని, తన కథని దొంగ తనం చేసారని అన్నారు.

కల్ట్ ఫిల్మ్

కల్ట్ ఫిల్మ్

గంగై అమరన్ మాటల్లో ఎంత నిజముందో తెలియదు కానీ క్షత్రియపుత్రుడు చిత్రం మాత్రం కల్ట్ క్లాసిక్ గా మిగిలింది.

కేవలం విభేధాలతోనే

కేవలం విభేధాలతోనే

ఆయన తన సోదరుడు ఇళయారాజాతో ఉన్న విభేదాలతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కమల్ అభిమానులు తిప్పికొడుతున్నారు.

ఈ వయస్సులో

ఈ వయస్సులో

గంగై అమరన్ వయస్సు కు తగ్గ మాటలు మాట్లాడటం లేదని, సోదరుడు తో విభేధాలు ఉంటే కూర్చుని చర్చించుకోవాలని కానీ ఇలా మీడియాకు ఎక్కి ఆరోపణలు చేయటం భావ్యం కాదని సినీ పెద్దలు అంటున్నారు.

English summary
It is a known fact that Gangai Amaran and Ilaiyaraaja are not in good terms for a long time now. But now, it looks like their sibling rivalry has gone to a whole new level as Gangai Amaran has made some serious allegations against his brother.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu