»   » మళ్ళీ సమంతతో గౌతమ్ మీనన్ చిత్రం..డిటెల్స్

మళ్ళీ సమంతతో గౌతమ్ మీనన్ చిత్రం..డిటెల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఏ మాయ చేసావె" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సమంత, ఆ చిత్ర దర్శకుడు గౌతమ్ మీనన్ తో మరో సారి కలిసి పనిచేయనుంది. సమంత, సమీరారెడ్డి, కార్తీక్, వీరా ప్రధాన పాత్రధారులుగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మనదేశం మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో అశోక్ వల్లభనేని ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను నిర్మాత తెలియజేస్తూ సమంత నాయికగా గౌతమ్ దర్శకత్వంలో వచ్చిన 'ఏ మాయ చేసావె" చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషలలో ద్విభాషా చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. గౌతమ్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పేరుని, పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.వేణుగోపాల్, నిర్మాత: అశోక్ వల్లభనేని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu