»   » కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న దేవదాస్ హీరో...

కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న దేవదాస్ హీరో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేవదాసు చిత్రంతో పరిచయమైన రామ్ తొలిచిత్రంతోనే మంచి నటుడిగా, డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తను నటించిన జగడం చిత్రం కమర్షియల్ గా ప్లాప్ అయినా రామ్ మార్కెట్ రేంజ్ ను పెంచిన చిత్రంగా అది నిలిచిపోయింది. ఇక రెడితో మరో హిట్ ను అందుకున్న రామ్ కు ఇప్పటి వరకు మరో సరైన హిట్ లేదు.

కాగా ప్రతస్తుతం రామ్ బెల్లంకొండ నిర్మిస్తున్న 'కందిరీగ" చిత్రంలో నటిస్తున్నాడు. ఇవికాక తను నటిస్తున్న మరో రెండు చిత్రాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అందులో ఒకటి కరుణాకరన్ దర్శకత్వంలో నటించనున్న మన 'లవ్ స్టోరి" చిత్రం. మరొకటి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ చిత్రం కాగా ఈ చిత్రంతోనే రామ్ తమిళ సినీ పరిశ్రమకు కూడా పరిచయం కాబోతున్నాడు.

English summary
Ace director Gautham Menon is planning to direct a film with Tollywood Young and energetic hero Ram and he has roped in his favorite lady Samantha for the female lead role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu