»   » బికినీ ఆయనకు ఇష్టం లేదు...సమంతా

బికినీ ఆయనకు ఇష్టం లేదు...సమంతా

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఏ మాయ చేసావె' చిత్రంలో నేను చేసిన జెస్సీ రోల్ త్రిష తమిళంలో చేసింది. ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి పాత్రను కలుసుకుని ఉంటారు అంటోది సమంతా. ఏమి మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం స్టార్ గా మారిన సమంత తాజాగా తమిళ మీడియాతో మాట్లాడింది. ఆమె మాటల్లో...జెస్సిలాంటి వారిని చూసామంటూ...సినిమా చూసిన చాల మంది నా దగ్గర ప్రస్దావించారు. ఇక ఈ చిత్రంలో నేను గౌతమ్ సార్ ఎలా చెపితే అలా చేసాను. ఎందుకంటే ఆయన నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు...వాటిని వమ్ము చెయ్యబుద్ది కాలేదు. ఇక నేను ఇంత గొప్ప పాత్రను మళ్ళీ జీవితంలో చేస్తానని నమ్మకం లేదు. ఇక గౌతమ్ సార్ నన్ను చీరకట్టులో ఈ చిత్రంలో చూపెట్టారు. ఆయనకు బికినీలలో నన్ను చూపెట్టడం ఇష్టలేదు. ఆ విషయం ప్రతీ ఫ్రేమ్ లోనూ స్పష్టంగా కనపడుతుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తో కలిసి బృందావనంలో చేస్తున్నాను. అలాగే మహేష్ బాబు సరసన చేయటానికి కూడా కమిట్ అయ్యాను. మరికొన్ని తమిళ చిత్రాలు ఒప్పుకోవాల్సినవి ఉన్నాయి అంది. ఇక సమంత తల్లి తండ్రులు తెలుగువాళ్ళు. అయితే ఆమె పుట్టింది పెరిగింది మాత్రం కేరళలో. ఆమె పూర్తి పేరు సమంతా రుతు ప్రభు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu