»   » మాజీ హీరో కొడుకుతో మణిరత్నం చిత్రం

మాజీ హీరో కొడుకుతో మణిరత్నం చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

మణిరత్నం ఓ లవ్ ఎంటర్టైనర్ చి్త్రం తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన రూపొందించిన ఘర్షణ చిత్రంలో హీరోగా చేసిన కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రం రూపొందనుంది. అస్సలు ఈ ప్రాజెక్టుకు ముందు ఈయన తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన పొనియన్ సెల్వన్ చిత్రాన్ని విజయ్ తో తెరకెక్కించాలని ప్రయత్నించారు. కానీ బడ్జెట్ బాగా ఎక్కువ అవటంతో మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని డ్రాప్ అయ్యారు. దాంతో ఇప్పుడు ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక గౌతమ్ కార్తీక్ ప్రక్కన చేయబోయే హీరోయిన్ కోసం ఎంపక ప్రస్తుతం జరుగుతోంది. ఇక గౌతమ్ హీరోగా చిత్రాలు నిర్మించేం దుకు ఇప్పటికే చాలామంది ప్రయత్నించారు. తొలి చిత్రం మణిరత్నం దర్శకత్వంలోనే రూపొందాలని కార్తీక్ నిర్ణయించుకోవటంతో ఆ ప్రాజెక్టులో ఇలా షేప్ అప్ అయ్యింది. కాగా ఈ చిత్రానికి పూకడై అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి సంగీతం ఏఆర్.రెహ్మాన్. మరో సఖి లాంటి రొమాంటిక్ ఫిల్మ్ ని త్వరలో చూడబోతున్నామన్నమాట.

English summary
Gautham…one more youngster is likely to craft his impact in Kollywood, soon. As per the sources available Gautham, veteran Kollywood actor Karthik scion seems to make his debut to films with ace director Mani Ratnam’s new flick.
Please Wait while comments are loading...